BigTV English

Sharmila: సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు షర్మిల ఫిర్యాదు.. 8 మందిపై కేసు నమోదు

Sharmila: సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు షర్మిల ఫిర్యాదు.. 8 మందిపై కేసు నమోదు

YS Sharmila news today


Sharmila complains to cyber crime police(AP political news): ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సైబర్ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ర్పచారం జరుగుతుందని ఫిర్యాదు చేశారు. తనను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారని వాపోయారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్ట కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇలా కొందరు సామాజిక మాధ్యమాల్లో అసభ్య కామెంట్లు పెడుతున్నారని కొందరిపై ఫిర్యాదు చేశారు.


నటి శ్రీరెడ్డి, మేదరమెట్ల కిరణ్‌కుమార్‌, మహ్మద్‌ రెహ్మత్‌ పాషా, రమేశ్‌ బులగాకుల, వర్రా రవీందర్‌ రెడ్డి, పంచ్‌ ప్రభాకర్‌, సేనాని, ఆదిత్య, సత్యకుమార్‌ మొత్తం 8 మందిపై ఫిర్యాదు చేశారు.  వారిపై తక్షణమే చర్యలు చేపట్టాలని.. లేకపోతే తనకు చాలా నష్టం చేకూర్చారని తెలిపారు.

Read More: పర్యాటకులకు గుడ్ న్యూస్.. విశాఖలో ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రారంభం..

సొంత అన్నతోనే విభేదాలు పెట్టుకున్నానని, చంద్రబాబుతో చేతులు కలిపి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నానని, ఇలా తన గౌరవాన్ని అవమానించేలా వాళ్లు  విమర్శిస్తున్నారని  ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళలను అప్రతిష్ఠపాలు చేసేలా యూట్యూబ్‌ ఛానెళ్లు నడుపుతున్నారని పేర్కొన్నారు.

ఈ మేరకు షర్మిల రెండు ఫిర్యాదులు చేశారు. దీనిపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు స్పందించి కేసు నమోదు చేసుకున్నారు. షర్మిల భర్త అనిల్‌  ఫిర్యాదు చేశారని సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామన్నారు.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×