BigTV English

Women Traffic Violation: నన్నే అడ్డుకుంటావా..? హోంగార్డు ఫోన్ పగులగొట్టిన మహిళ..

Women Traffic Violation: నన్నే అడ్డుకుంటావా..? హోంగార్డు ఫోన్ పగులగొట్టిన మహిళ..

 


Woman Traffic Violation in BanjaraHills

Woman Traffic Violation in BanjaraHills: పగలనక, రాత్రనక ప్రజల కోసం పోలీసులు ఎంతో కష్టపడుతుంటారు. రోడ్డుమీద ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు అవగాహన కల్పిస్తుంటారు. డ్రకెంగ్ డ్రైవింగ్‌లు, రాంగ్ రూట్లు, హెల్మెట్‌లు పెట్టుకోవడం, ట్రిపుల్ రైడింగ్‌లు చేయొద్దని పోలీసులు తరచూ హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ అలాంటి పోలీసులపై కొందరు బూతులు తిడుతూ దాడులు చేస్తున్నారు.


కానీ జనాలు మాత్రం ఎంత చెప్పినా కూడా అస్సలు రూల్స్ పాటించేవారు చాలా తక్కువ. కొందరైతే ఇలా రూల్స్ పాటించడం కాదు.. ఏకంగా పోలీసుల మీద దాడులకు పాల్పడుతుంటారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వార్తలలో చూస్తున్నాం. ఇటీవల ఓ యువకుడు అమీర్‌పేట్ మెట్రో వద్ద ట్రాఫిక్ పోలీసులపై బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. అలా వార్నింగ్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో వైరల్‌ అయింది. తాజాగా, ఇలాంటి మరో ఘటన వార్తలలో నిలిచింది.

వివరాలోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ మహిళ తన జాగ్వార్ కారేసుకుని రాంగ్ రూట్‌లో వచ్చింది. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఆమెను అడ్డుకున్నాడు. నన్నే అడ్డుకుంటావా అని ఆ మహిళ రెచ్చిపోయింది. హోంగార్డును బూతూలు తిడుతూ నన్నే ఆపుతావా.. రాంగ్ రూట్‌లో చాలా మంది వెళ్తుంటారు నన్నే ఎందుకు ఆపావు అంటూ బూతులు తిట్టింది. అంతటితో ఆగకుండా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కల్పించింది.

Read More: సీబీఐ నోటీసులతో డైలమాలో కవిత.. విచారణకు హాజరవుతారా ?

హోంగార్డు అడ్డుపడుతున్నా కూడా కారులో కూర్చుని ముందుకు పోనిచ్చింది. అక్కడున్న కొందరు ఆ మహిళకి సర్ధి చేప్పే ప్రయత్నం చేసిన కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా, హోంగార్డుపై రివర్స్‌లో అటాక్ ప్రారంభించింది.

ఈ ఘటనను వీడియో తీస్తున్న హోంగార్డుపై దాడిచేసి, బట్టలు చింపేసింది. ఆ తర్వాత హోంగార్డు ఫోన్‌ను తీసుకుని నెలకేసి కొట్టి నానా రచ్చ చేసింది. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తూ చేపట్టారు.

Tags

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×