E-Paper
Advertisement

Chanakya Niti: అమ్మాయిల్లో అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడే.. గుణం ఏంటో తెలుసా ?

Chanakya Niti: అమ్మాయిల్లో అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడే.. గుణం ఏంటో తెలుసా ?
Advertisement

Chanakya Niti: ఆచార్య చాణక్యుడి ప్రకారం.. ప్రపంచం బలహీనులను ఎప్పుడూ అణచివేయడానికే చూస్తుంది. ఇది కేవలం రాజ్యతంత్రానికే కాదు.. సంబంధాలకు కూడా వర్తిస్తుంది. ఎప్పుడూ అందరినీ మెప్పించేలా ‘మంచిగా’ ఉంటూ, తన వ్యక్తిత్వాన్ని చంపుకునే అమ్మాయిల కంటే.. ఆత్మాభిమానం కలిగి, తప్పును ఎదిరించే అమ్మాయిల పట్ల పురుషులు రహస్యంగా విపరీతమైన ఆరాధనను కలిగి ఉంటారు. ఇతరుల కోసం తనను తాను మార్చుకోని అమ్మాయలని పురుషులు అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తిగా , గౌరవప్రదమైన తోడుగా భావిస్తారని చాణక్య నీతి వివరిస్తుంది.

సాధారణంగా సమాజం అమ్మాయిలను సున్నితంగా.. సర్దుకుపోయేలా ఉండాలని ఆశిస్తుంది. కానీ ఆచార్య చాణక్యుడు తన ‘నీతి శాస్త్రం’లో మానవ మనస్తత్వం గురించి భిన్నమైన లోతైన విశ్లేషణను ఇచ్చారు. పురుషులు పైన కనిపించే.. సున్నితత్వం కంటే.. లోపల దృఢంగా ఉండి, అందరినీ మెప్పించడానికి ప్రయత్నించని అమ్మాయిల పట్ల రహస్యంగా ఎందుకు ఆకర్షితులవుతారో ఈ కింది అంశాల ద్వారా అర్థం చేసుకోవచ్చు.

Advertisement

1. ఆత్మాభిమానం, స్వయం ప్రతిపత్తి: చాణక్యుడి ప్రకారం.. “అతి వినయం ధూర్త లక్షణం”. అంటే అవసరానికి మించి వినయంగా ఉండటం లేదా ఎప్పుడూ అందరి ముందు మంచిగా నటించడం వల్ల వ్యక్తిత్వం మరుగున పడిపోతుంది. ఎవరైతే అమ్మాయిలు తన పరిధులను స్పష్టంగా గీసుకుంటుందో.. తన విలువలకు వ్యతిరేకంగా ఎవరికీ తలొగ్గదో, అలాంటి అమ్మాయి పురుషుడి దృష్టిలో ఒక ‘సవాల్‌’గా కనిపిస్తుంది. పురుషులు సహజంగానే సాహసవంతులు, కాబట్టి లొంగిపోయే స్వభావం కంటే నిలబడే వ్యక్తిత్వానికే వారు ఎక్కువ విలువ ఇస్తారు.

2. మేధోపరమైన ఆకర్షణ: చాణక్యుడు జ్ఞానానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఎప్పుడూ అందరితో ఏకీభవించే అమ్మాయి కంటే.. సొంతంగా ఆలోచించి ఎదుటివారిని ప్రశ్నించే లేదా తప్పును ఎత్తిచూపే అమ్మాయితో మాట్లాడటం పురుషుడికి ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటి అమ్మాయితో గడిపే సమయం మానసికంగా అతనికి ఉత్సాహాన్నిస్తుంది. ఇక్కడ ‘మంచిగా ఉండకపోవడం’ అంటే మొరటుగా ఉండటం కాదు. ఒకరి ఆధిపత్యానికి లొంగకుండా తన అభిప్రాయాన్ని నిజాయితీగా చెప్పడం.

Advertisement

3. బాధ్యతాయుతమైన తోడు: ఒక తెలివైన పురుషుడు ఎప్పుడూ తనను అంధుడిలా అనుసరించే అమ్మాయి కంటే, తాను తప్పు చేసినప్పుడు వారించే స్త్రీని కోరుకుంటాడు. చాణక్యుని సూత్రాల ప్రకారం.. భార్య లేదా భాగస్వామి మంత్రి లాగా సలహా ఇచ్చేదిగా ఉండాలి. తన నిర్ణయాల్లో స్పష్టత ఉండి, అన్యాయాన్ని ఎదిరించే  అమ్మాయి భవిష్యత్తులో తన కుటుంబాన్ని కూడా అంతే ధైర్యంగా రక్షించగలదని పురుషుడు నమ్ముతాడు.

4. ఊహకందని వ్యక్తిత్వం: ప్రతి విషయంలో “సరే” అనే అమ్మాయి ప్రవర్తన ముందే ఊహించదగినదిగా మారుతుంది. దీనివల్ల కాలక్రమేణా సంబంధంలో బోర్ కొట్టే అవకాశం ఉంది. కానీ, తనను తాను ప్రేమించుకుంటూ, తనకంటూ కొన్ని నియమాలు పెట్టుకునే అమ్మాయి పురుషుడికి ఎప్పుడూ కొత్తగా కనిపిస్తుంది. ఆమెను అర్థం చేసుకోవడానికి, ఆమె గౌరవాన్ని పొందడానికి పురుషుడు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఈ ప్రయత్నమే సంబంధాన్ని బలంగా ఉంచుతుంది.

AlsoRead: మహాశివరాత్రి 2026.. శుభ ముహూర్తం, పూజా విధానం

5. గౌరవం, సమానత్వం: చాణక్యుడు ఎప్పుడూ పరస్పర గౌరవం లేని చోట సంబంధం ఉండకూడదని చెప్పారు. తనను తాను గౌరవించుకోని వారు ఇతరుల గౌరవాన్ని పొందలేరు. ‘నైస్ గా’ ఉంటూ అందరి ఇష్టాలకు అనుగుణంగా నడుచుకునే అమ్మాయి తన గౌరవాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ.. తన హక్కుల కోసం పోరాడే అమ్మాయిని చూసినప్పుడు పురుషుడికి ఆమెపై తెలియని భయం, గౌరవం కలుగుతాయి.

చాణక్య నీతి సారాంశం ప్రకారం.. లోకం బలవంతుడికే దాసోహమంటుంది. అమ్మాయి తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నప్పుడు, ఆమె ఎవరినీ ఆకర్షించడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఆమెలోని ఆత్మవిశ్వాసమే ఆమెకు ఒక ఆభరణంలా మారుతుంది. పురుషులు రహస్యంగా ఇలాంటి అమ్మాయిలనే ఆరాధిస్తారు ఎందుకంటే ఆమె ఒక బొమ్మలా కాకుండా, రక్తమాంసాలు, బలమైన మేధస్సు ఉన్న శక్తిలా కనిపిస్తుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×