BigTV English

AP: ఏపీలో అద్భుత దృశ్యం.. భారీగా ఎగబడి చూస్తున్న జనాలు

AP: ఏపీలో అద్భుత దృశ్యం.. భారీగా ఎగబడి చూస్తున్న జనాలు

Srisailam Dam gates opened: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వరద ఉధృతి కారణంగా నీటి మట్టం పెరగడంతో అధికారులు జలాశయం గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో గేట్ల నుంచి కృష్ణమ్మ బిరా బిరా మంటూ కిందకు పరుగులు పెడుతున్నది. ఈ దృశ్యాలను జనాలు చూస్తూ సంబురపడుతున్నారు. ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్లను వీడియో తీసుకుంటున్నారు.


అయితే, ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణ, తుంగభద్ర నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నిండుకుండలా మారింది. జలాశయం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 878 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. నీటిమట్టం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి మట్టం 180 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం జలాశయానికి భారీగా వరద నీరు వస్తున్నది. 4.67 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రస్తుతం ఉంది. ఈ నేపథ్యంలో గంట గంటకు ప్రాజెక్టులోని నీటి మట్టం పెరగడం, గంటకు ఒక టీఎంసీ చొప్పున డ్యాంకు నీరు వచ్చి చేరుతుండడంతో ఏ క్షణమైనా జలాశయ నీటి నిల్వలు పూర్తిస్థాయికి చేరే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో ముందస్తుగా ఎగువ నారాయణ పూర్, అలమట్టి, జూరాల ప్రాజెక్టుల నుంచి వస్తున్న కృష్ణా ప్రవాహంతోపాటు ఇటు తుంగభద్ర జలాశయం, సుంకేసుల బ్యారేజ్ నుంచి వస్తున్నటువంటి నీటి ప్రవాహాన్ని లెక్క కట్టిన అధికారులు కనిష్ఠ స్థాయిలో శ్రీశైలం జలాశయంలో నీటిని నిలువ చేశారు.

Also Read: ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం..


ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాన్ని దిగువకు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. నేడు సాయంత్రం 4 గంటలకు అధికారులు శ్రీశైలం జలాశయం మూడు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 80 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు ఒక్కో గేటు నుంచి 27 వేల క్యూసెక్కుల వరకు నీరు విడుదలవుతుందని అధికారులు చెబుతున్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×