BigTV English

SSLV-D3 Rocket: శ్రీహరికోట నుంచి మరో రాకెట్ ప్రయోగం.. కౌంటింగ్ స్టార్ట్.. దీని ప్రత్యేకతలివే..

SSLV-D3 Rocket: శ్రీహరికోట నుంచి మరో రాకెట్ ప్రయోగం.. కౌంటింగ్ స్టార్ట్.. దీని ప్రత్యేకతలివే..

SSLV-D3 Rocket launch from Shaar on august 16: ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి మరో రాకెట్ లాంచ్ కానున్నది. ఇందుకు సంబంధించిన కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. శుక్రవారం షార్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఉదయం 9.17 గంటలకు నింగిలోకి రాకెట్ ను లాంచ్ చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. అయితే, ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి పంపనున్న ఈఓఎస్ -08 శాటిలైట్ ఉపగ్రహం భూ పరిశీలన చేస్తుందని ఆయన వివరించారు. ఇందుకు సంబంధించిన ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగ ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు.


Also Read: ఏపీలో ఒక్కరోజే 100 అన్న క్యాంటీన్లు పున:ప్రారంభం

అదేవిధంగా ఈ సంవత్సరం ప్రయోగించనున్న రాకెట్ల వివరాలను కూడా ఆయన వివరించారు. నవంబర్ లో గగన్ యాన్ రాకెట్, నావిక్ శాట్ ప్రయోగం చేస్తున్నట్లు సోమనాథ్ స్పష్టం చేశారు. ఈ ఏడాదిలో పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం ద్వారా ప్రోబ్ శాటిలైట్ నింగిలోకి వెళ్తుందని ఆయన తెలిపారు. నాసా వారి నిస్సార్ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ఆయన చెప్పారు. జీఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, ఎంకె3, ఎల్వీఎం 3 రాకెట్ ప్రయోగాల నింగిలోకి విభిన్న ఉపగ్రహాలు పంపనున్నట్లు ఆయన వివరించారు. మరో ఏడాదిలో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్, జియో ఇమేజింగ్ శాటిలైట్, టెక్నాలజీ డెవలప్ మెంట్ శాటిలైట్, టీడీఎస్ రాకెట్ ప్రయోగాలకు సిద్ధమవుతున్నదని ఆయన పేర్కొన్నారు.


Tags

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×