BigTV English
Advertisement

Mars Retrograde 2024: అంగారకుడి సంచారం.. ఈ రాశుల వారు తప్పక వాహనాలు కొనుగోలు చేస్తారు

Mars Retrograde 2024: అంగారకుడి సంచారం.. ఈ రాశుల వారు తప్పక వాహనాలు కొనుగోలు చేస్తారు

Mars Retrograde 2024: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలో మార్పు వల్ల ముఖ్యమైందిగా చెబుతారు. ఇది ప్రజల మనసుపై తీవ్ర ప్రభావాలను చూపిస్తుంది. 2024 శని, బుధుడు, బృహస్పతి, అంగారక గ్రహాలతో సహా నాలుగు గ్రహాలు తిరోగమనంలో సంచరించనున్నాయి. ఈ సమయంలో బుధుడు, శని గ్రహాలు తిరోగమన స్థితిలో ఉంటాయి. 2024 సంవత్సరం చివరలో శక్తి , ధైర్యం, విశ్వాసం, పరాక్రమాలను సూచించే గ్రహంగా అంగారకుడిని పరిగణిస్తారు.


ప్రస్తుతం అంగారకుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. 45 రోజులకు ఒకసారి కుజుడు తన రాశి మార్చుకుంటాడు. ఆగస్టు 24న కుజుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఈ రాశికి అధిపతిగా చెబుతుంటారు. ఈ ఏడాదికి చివరి నాటికి అంగారకుడు తెరుగు ప్రయాణాన్ని మొదలు పెడతాడు.

దృక్ పంచాంగం ప్రకారం అంగారక గ్రహం డిసెంబరు 7, 2024 శనివారం ఉదయం 5:01 గంటలకు తిరోగమన దశలోకి వెళ్లనున్నాడు. ఫిబ్రవరి 24, 2025 సోమవారం ఉదయం 7:24 గంటల వరకు తిరోగమన స్థితిలో ఉంటాడు. మేషం నుంచి మీనం వరకు 12 రాశులపై ఇది అశుభ ప్రభావాలను చూపిస్తుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2024 చివరి నెలలో అంగారకుడి తిరోగమనం కారణంగా కొన్ని రాశుల వారు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:
అంగారకుడి తిరోగమన కదలిక మేష రాశి వ్యక్తుల జీవితాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో భూమి, వాహనాలు కొనుగోలు చేస్తారు. దీని వల్ల మీరు ఆనందాన్ని పొందుతారు. కెరీర్‌లో ఆటంకాలు కూడా తొలగిపోతాయి. మీ సామాజిక హోదా కూడా పెరుగుతుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ లేదా వేతన పెంపు, ఇంక్రిమెంట్ వంటివి పొందుతారు. ఆస్తిలో వృద్ధి కూడా ఉంటుంది. కోర్టు విషయంలో కొనసాగుతున్న వివాదాలు పరిష్కారం అవుతాయి.

కర్కాటక రాశి:
కర్కాట రాశి వారికి అంగారకుడి సంచారం అద్భుత ప్రయోజనాలను ఇస్తుంది. ఈ సమయంలో మీ ధైర్య సాహసాలు కూడా పెరుగుతాయి. విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. మీ అధికారుల వల్ల మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది. మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మీరు కెరీర్‌లో గొప్ప విజయాలను పొందుతారు.

కన్య రాశి:
అంగారకుడి తిరోగమన కదలిక వల్ల కన్య రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. అంగారకుడి గమనంలో మార్పు వల్ల కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడతాయి. మీరు మీ పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు . జీవితంలో చిన్న సానుకూల మార్పులు కలుగుతాయి. మీ పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. జీవితం సుఖాలు, విలాసాలతో గడిచిపోతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తారు.

Also Read: సంసప్తక యోగ ప్రభావం.. తండ్రీకొడుకులపై చెడు దృష్టి

తులా రాశి:

ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ఆదాయాలకు తగినంత ఖర్చులు పెడుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో సక్సెస్ అవుతారు. ఉద్యోగులకు ఉన్నత పదవులు వచ్చే అవకాశం ఉంది. పెట్టుడుదారులకు మంచి ఫలితాలు ఉంటాయి. అదనపు రాబడితో హుషారుగా ఉంటారు.శుభ కార్యాలల్లో పాల్గొనే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు.

Related News

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Big Stories

×