E-Paper
Advertisement

Amaravati: అమరావతి కేసులో జగన్‌కు షాక్.. సుప్రీంకోర్టులో చుక్కెదురు..

Amaravati: అమరావతి కేసులో జగన్‌కు షాక్.. సుప్రీంకోర్టులో చుక్కెదురు..
Advertisement

Amaravati: అమరావతిపై ఏపీ సర్కారు ముందడుగు వేయడం లేదు. రాజధాని రైతులు పట్టు వీడటం లేదు. మూడు రాజధానులు వద్దు.. అమరావతినే ముద్దు.. అంటూ స్థానికులు హైకోర్టుకు వెళ్లారు. అమరావతి నిర్మాణం పూర్తి చేయాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. తాజాగా అక్కడా చుక్కెదురైంది.

అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరగా.. స్టే ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. కేసు విచారణ వీలైనంత త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేయగా.. సుప్రీంకోర్టు సున్నితంగా తిరస్కరించింది. ఈ కేసులో అనేక మంది ప్రతివాదులు ఉన్నారని.. వారందరి వాదనలు వినాల్సి ఉందని తెలిపింది. తాము ఇతర కేసులు కూడా విచారించాల్సి ఉందంటూ ఒకింత ఘాటుగానే స్పందించింది.

Advertisement

కనీసం వచ్చే నెలలోనైనా విచారణ జరపాలని ఏపీ తరఫు న్యాయవాదులు అభ్యర్థించగా.. కేసును జులై 11కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.

Related News

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

Big Stories

Advertisement
×