BigTV English

Solar:- సోలార్ స్టార్మ్‌ను శాస్త్రవేత్తలు ఎందుకు కనిపెట్టలేదంటే..?

Solar:- సోలార్ స్టార్మ్‌ను శాస్త్రవేత్తలు ఎందుకు కనిపెట్టలేదంటే..?

Solar:- ప్రకృతి వైపరీత్యాలు అనేవి ఒక్కొక్కసారి భూగ్రహానికి తీవ్ర నష్టాన్ని మిగిలిస్తాయి. కేవలం భూమిపైన జరిగే ప్రకృతి వైపరీత్యాలు మాత్రమే కాకుండా ఆకాశంలో, అంతరిక్షంలో జరిగే వైపరీత్యాలు కూడా భూమిపైన ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. కానీ అలాంటి వాటికి ఆస్ట్రానాట్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అంతరిక్షంలో జరిగే మార్పులను వారు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు కాబట్టి.. వైపరీత్యాలను ముందే పసిగడతారు. కానీ ఈసారి అలా జరగలేదు.


తాజాగా ఒక శక్తివంతమైన సోలార్ స్టార్మ్ అనేది భూగ్రహాన్ని తాకింది. కానీ రిపోర్టుల ప్రకారం దీనిని ఎవరూ గమనించలేదని తెలుస్తోంది. దీనిపై పరీక్షలు చేసిన యూఎస్ నేషనల్ ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (నోవా) దీని తీవ్రతను జీ4 గ్రేడ్‌గా గుర్తించాయి. సోలార్ స్టార్మ్ అనేది ఇంత తీవ్రంగా సంభవించడం ఇది రెండోసారి. జీ4 గ్రేడ్ సోలార్ స్టార్మ్ అనేది పవర్ గ్రేడ్స్‌లో వోల్టేజ్ సమస్యలను తలెత్తేలా చేస్తుంది. అంతే కాకుండా పలు ఎలక్ట్రిక్ పరికరాలను ట్రిప్ అయ్యేలా కూడా చేస్తుంది.

ఇలాంటి జియోమ్యాగ్నిటిక్ స్టార్మ్స్ వల్ల స్పేస్‌క్రాఫ్ట్ ఆపరేషన్స్, ట్రాకింగ్ వంటి అంశాల్లో ఇబ్బందులు కలగవచ్చు. ఈ సోలార్ స్టార్మ్ వల్ల స్పేస్‌ప్లైట్ కంపెనీ అయిన రాకెట్ ల్యాబ్.. తన ఎలక్ట్రాన్ రాకెట్ లాంచ్‌ను 90 నిమిషాలు నిలిపివేయాల్సి వచ్చింది. మామూలుగా సోలార్ స్టార్మ్స్‌ను ఆస్ట్రానాట్స్ ముందే కనిపెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల భూమి మ్యాగ్నిటిక్ స్పియర్‌కు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. కానీ ఈసారి వారికి సోలార్ స్టార్మ్ గురించి ముందే తెలియకపోవడం, దానికి తగిన చర్యలు తీసుకోకపోవడం అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.


అసలు ఆస్ట్రానాట్స్ కానీ, ఫోర్‌క్యాస్టర్స్ కానీ ఈ సోలార్ స్టార్మ్‌ను ముందే ఎందుకు కనిపెట్టలేదు అనే అంశాన్ని యూఎస్ వాతావరణ ఫోర్‌కాస్టర్ తమీషా స్కోవ్ వివరించారు. మామూలుగా స్టార్మ్ అనేవి ఎక్కువగా శబ్దంతో ఏర్పడతాయి. కానీ ఈ స్టార్మ్ మాత్రం సైలెంట్‌గా సూర్యుడి నుండి బయటికి వచ్చింది. అందుకే ఎవరూ దీనిని ముందుగా కనిపెట్టలేకపోయారని తమీషా తెలిపింది. సైలెంట్ స్టార్మ్స్‌కు జీ4 స్టార్మ్ ఒక ఉదాహరణ అని ఆమె అన్నారు.

సక్సెస్‌ఫుల్‌గా ఇస్రో ‘బాహుబలి’ రాకెట్ లాంచ్..

for mnore updates follow this link:-Bigtv

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×