BigTV English

AP: జగన్ కు షాక్.. జీవో నెం.1పై సుప్రీంలో చుక్కెదురు..

AP: జగన్ కు షాక్.. జీవో నెం.1పై సుప్రీంలో చుక్కెదురు..

AP: కోర్టులు జగన్ కు గానీ, ఏపీ సర్కారుకు గానీ అంతగా కలిసిరావు. న్యాయస్థానాలతో పదే పదే మొట్టికాయలు తినడం ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఏపీ హైకోర్టు ముందు పలువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు చేతులు కట్టుకుని నిలబడాల్సి రావడం, శిక్షలు కూడా పడటం దారుణం. తాజాగా, జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 పైనా కోర్టులు అక్షింతలు వేస్తున్నాయి. ఇప్పటికే హైకోర్టు ఆ జీవో పై స్టే విధించింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా.. విచారణకు నిరాకరించింది. కేసు మళ్లీ ఏపీ హైకోర్టులోకే వచ్చి పడింది.


కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాటను కారణంగా చూపించి.. ఏపీలో రహదారులపై రోడ్డు షోలు, సభలు, సమావేశాలు నియంత్రణ కోసం జీవో నెంబర్ 1ను జారీ చేసింది ప్రభుత్వం. అయితే, ఈ జీవో ప్రతిపక్షాలను అడ్డుకోవడానికే అనేది ఆరోపణ. వైసీపీ వర్గీయులు ర్యాలీలు తీస్తుంటే అభ్యంతరం చెప్పని పోలీసులు.. కుప్పంలో చంద్రబాబు పర్యటనను మాత్రం అడ్డుకున్నారు. త్వరలో జరగబోవు పవన్ కల్యాణ్ వారాహి యాత్రను సైతం అడ్డుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో హైకోర్టులో కేసు ఫైల్ కావడం.. న్యాయమూర్తి స్టే ఇవ్వడంతో.. సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. తాజాగా, సుప్రీంలోనూ చుక్కెదురైంది.

జీవో నెంబర్‌ 1పై విచారణ ముగిస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని.. ఏపీ హైకోర్టు సీజే ధర్మాసనం దీనిపై విచారణ చేపడుతుందని సీజేఐ ధర్మాసనం తెలిపింది. వాద, ప్రతివాదులిరువురూ డివిజన్‌ బెంచ్‌ ముందు అన్ని అంశాలు ప్రస్తావించుకోవచ్చని సూచించింది. ఈనెల 23న జీవో నెంబర్‌ 1పై విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది సుప్రీం.


Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×