Folk Artist Raju Suicide: జానపద పాటలతో, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరించిన నటుడు గడ్డం రాజు.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆయన అభిమానులు, జానపద సంగీత రంగం, సినీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.
ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియో
రాజు సెప్టెంబర్ 29న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య టార్చర్ వల్లే చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ప్రాణాలు వదిలాడు. పెద్ద బతుకమ్మ పండక్కి భార్య కోసం కొన్న చీరతోనే ఉరి వేసుకుని చనిపోయాడు. తన సెల్ఫీ వీడియోలో ఏముందంటే.. అమ్మా, బాపు.. బతకలేకపోతున్నా.. ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. టార్చర్ అనిపిస్తోంది. మిమ్మల్ని ఊరికే తిడతాది. ఇల్లరికం వచ్చినట్లయిపోయింది నా పరిస్థితి. అన్నా, వదిన.. పిల్లలు జాగ్రత్త. సౌందర్య.. మంచిగ బతుకు. నీలాంటిదానికి మొగోళ్లు సెట్ కారు. నువ్వన్నమాటలకు మెంటల్ టార్చర్ అయితుంది. పెళ్లయినప్పటి నుంచి టార్చరే! ఈ బతుకు బ్రతకలేకపోతున్నాను. పండక్కి నా భార్యకు చీర కొన్నా.. డబ్బుల్లేవని నేను డ్రెస్ కూడా కొనుక్కోలే.. అమ్మా, బాపు బై’ అని కన్నీళ్లు పెట్టుకున్న సెల్ఫీ వీడియో గ్రామాల్లో వైరల్ అవుతుంది.
ప్రేమ పెళ్లి.. ఆరు నెలలలోనే విషాదం
గడ్డం రాజు, భార్య సౌందర్యలు ప్రేమ వివాహాం చేసుకున్నారు. అయితే కేవలం ఆరు నెలల పెళ్లి బంధంలోనే విభేదాలు పెరిగి, దాంపత్యంలో కలహాలు చోటుచేసుకున్నాయి. రాజు తరచూ కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపంలోకి వెళ్లాడని, చివరికి ప్రాణాలు తీసుకోవడానికి దారితీసిందని ఆయన బంధువులు చెబుతున్నారు.
అంత్యక్రియలు స్వస్థలంలోనే
గడ్డం రాజు స్వస్థలం పెద్దపల్లి జిల్లా, కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్ పేట. అక్కడే ఆయన అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. రాజును చివరి సారి చూసేందుకు పెద్ద సంఖ్యలో జనాలు తరలివచ్చారు.
జానపద రంగంలో పేరు తెచ్చుకున్న రాజు
గడ్డం రాజు రాము.. కాటి కట్టెల పాలాయనే బ్రతుకు, సీతా, నా ప్రాణమే నిన్ను కోరితే, వంటి లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్’లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. గ్రామీణ ప్రేక్షకుల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సాదాసీదా జీవితం గడుపుతూ, తన కళతో జీవనం సాగించాలనుకున్న రాజు ఇలా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం అని కొందరు చెబుతున్నారు.
Also Read: లిక్కర్ షాపులకు దసరా కిక్కు.. భారీగా పెరిగిన మద్యం విక్రయాలు
ఆత్మహత్య వెనుక కారణాలపై పోలీసులు దర్యాప్తు
గడ్డం రాజు ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆయన సెల్ఫీ వీడియోను ఆధారంగా తీసుకుని, కుటుంబ కలహాలే కారణమా? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. బంధువులు, స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు.
భార్య టార్చర్ భరించలేక జానపద నటుడు గడ్డం రాజు ఆత్మహత్య..
సెప్టెంబర్ 29న జరిగిన ఘటన
ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న గడ్డం రాజు
స్వస్థలం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్ పేటలో అంత్యక్రియలు
నెల రోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న గడ్డం రాజు
బతుకమ్మ… pic.twitter.com/8btSXRXjto
— BIG TV Breaking News (@bigtvtelugu) October 3, 2025