E-Paper
Advertisement

Palnadu Crime: సుప్రీంకోర్టు ఆదేశాలు.. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్, నెక్ట్స్ ఏంటి?

Palnadu Crime:  సుప్రీంకోర్టు ఆదేశాలు..  కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్, నెక్ట్స్ ఏంటి?
Advertisement

Palnadu Crime: జంట హత్య కేసులో ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతడి సోదరుడు వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A-6, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి A-7 నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలో వారి తల్లి రాములమ్మ, సోదరి నాగమణి కన్నీరు మున్నీరు అయ్యారు.

కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్

Advertisement

పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గురువారం ఉదయం స్థానిక న్యాయస్థానంలో లొంగిపోయారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు ఈ ఏడాది మే 24న హత్యకు గురయ్యారు.

Advertisement

గ్రామంలో ఆధిపత్య పోరును అనుకూలంగా మలచుకొని జంట హత్యలకు పరోక్షంగా సహకరించారనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి. ఈ కేసులో పిన్నెల్లి సోదరులను ఏ6, ఏ7గా చేర్చి కేసు నమోదు చేశారు  పోలీసులు. ఈ కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్‌‌ను హైకోర్టు రద్దు చేసింది.  ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు.

14 రోజులు రిమాండ్ విధించిన మాచర్ల న్యాయస్థానం

చివరకు అక్కడా బెయిల్‌ పిటిషన్‌ రద్దైంది. రెండు వారాల్లో లొంగిపోవాలని పోయినవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు గురువారం కోర్టులో లొంగిపోయారు. మాచర్లలోని జూనియర్‌ అదనపు సివిల్‌ జడ్జి కోర్టుకు పిన్నెల్లి బ్రదర్స్ వచ్చారు. నేతలు న్యాయస్థానానికి హాజరైన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోస్తు ఏర్పాటు చేశారు. గతరాత్రి నుంచి 144 సెక్షన్ విధించారు. 

వైసీపీ నేతలు కోర్టుకి వెళ్లకుండా వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎక్కడికక్కడ ఆ పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. న్యాయస్థానం పిన్నెల్లి సోదరులకు 14 రోజులు రిమాండ్ విధించింది. మాచర్ల నుంచి నెల్లూరు జైలుకి వీరిని తరలించారు.  ఈ కేసులో రేపో మాపో వీరిద్దరిని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.  

ALSO READ: బోరుగడ్డకు షాకిచ్చిన వైసీపీ

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×