E-Paper
Advertisement

తిరుమల లడ్డూ కల్తీ కేసు అంశం.. నో చెప్పిన సుప్రీంకోర్టు, ఇంతకీ ఆ పిటిషన్ ఏంటి?

తిరుమల లడ్డూ కల్తీ కేసు అంశం.. నో చెప్పిన సుప్రీంకోర్టు, ఇంతకీ ఆ పిటిషన్ ఏంటి?
Advertisement

Supreme Court: తిరుమల లడ్డూ కల్తీ కేసులో సుప్రీంకోర్టు మరొక తీర్పు ఇచ్చింది. ఈ కేసు విచారణను ఏపీ వెలుపలకు బదిలీ చేసేందుకు నో చెప్పింది. దీంతో ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. అలాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని తేల్చిచెప్పింది. అసలు ఏం జరిగింది?

తిరుమల లడ్డూ కల్తీ కేసు వ్యవహారం

తిరుమల లడ్డూ కల్తీ కేసు విచారణ వేగంగా జరుగుతోంది. దీనిపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం అప్పుడప్పుడు చోటు చేసుకుంటూనే ఉంటుంది. ఈ క్రమంలో కేసును ఏపీ వెలుపలకు బదిలీ చేయాలని ఓ పిటిషన్ సుప్రంకోర్టులో దాఖలైంది. ఈ పిటిషన్‌ను మహారాష్ట్రకు చెందిన ఓ ప్రైవేటు డెయిరీ పరిశ్రమ ఎండీ మశ్చీంద్ర శాంతారామ్ వేశారు. పిటిషన్‌లో సదరు వ్యక్తి అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుతం కేసుకు సంబంధించి తిరుపతిలో ట్రయిల్ జరుగుతోందని, ఆ మొత్తానికి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని పేర్కొన్నారు.

Advertisement

అందులో రాజకీయ కోణాలు ఎక్కువగా ఉన్నాయని, సున్నితమైన అంశమని, తనను పావుగా వాడుకుంటున్నారని పేర్కొన్నారు. రాజకీయ పరమైన వ్యాఖ్యలు చోటు చేసుకుంటున్నాయని, దీనిపై సీఎం, డిప్యూటీ సీఎం నిరంతరం ప్రకటన చేస్తున్నారని వెల్లడించారు. విచారణ న్యాయంగా ఉండాలని భావిస్తూ పిటిషనర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో పిటిషనర్ నిందితుడి ఉన్నారు. రాజకీయాలకు ఈ కేసు వాడుకుంటున్నారని, ఇందులో తాము నష్టపోతున్నామని వెల్లడించారు.

పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు

ఈ కేసులో నిందితులు ఉత్తరాదికి చెందినవారు కావడంతో భాషా పరమైన సమస్య ఉత్పన్నం అవుతుందన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌ను తాము ఎంటర్ టైన్ చేయడం లేదని తెలిపింది. దీన్ని విచారణకు తీసుకోలేమని స్పష్టం చేసింది. ఈ కేసులో రాజకీయ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది.

Advertisement

ALSO READ: పులివెందులలో సేమ్ సీన్ రిపీట్.. టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ.. టపాకాయలు, రాళ్లతో దాడులు

అలాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే.. తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొంది. ట్రయిల్‌ను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని విషయాన్ని తాము పరిగణనలోకి తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. ఈ కేసు అంతా ఏపీతో ముడిపడి ఉందని.. సాక్షులు, సాక్షాధారాలు అన్నీ అక్కడే ఉన్నాయన్నాయని తెలిపింది. ఇలాంటి సమయంలో ట్రయిల్‌ను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చేసింది సుప్రీంకోర్టు.

Related News

పులివెందులలో సేమ్ సీన్ రిపీట్.. టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ.. టపాకాయలు, రాళ్లతో దాడులు

ఎన్నికల పోలింగ్ వేళ చంద్రగిరిలో ఊహించని సీన్.. ఇది మామూలు ర్యాగింగ్ కాదు, ఏకంగా చెవిరెడ్డికే

ఏపీలో డీఎస్సీ-2026 నోటిఫికేషన్ రిలీజ్.. 2721 పోస్టులు భర్తీ, నవంబర్ 11 నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఏపీలో ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు, భారీగా బలగాలు మోహరింపు

ఏపీలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ వాయిదా!

కొటియా సరిహద్దుల్లో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత.. 21 గ్రామాలను ముట్టడించిన పోలీసులు!

ఏపీలో పూర్తిగా ఉనికి కోల్పోయిన వైసీపీ.. ఎమ్మెల్యే బోండా సంచలన వ్యాఖ్యలు?

Big Stories

Advertisement
×