E-Paper
Advertisement

కొటియా సరిహద్దుల్లో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత.. 21 గ్రామాలను ముట్టడించిన పోలీసులు!

కొటియా సరిహద్దుల్లో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత.. 21 గ్రామాలను ముట్టడించిన పోలీసులు!
Advertisement

Kotia Villages: ఏపీలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో కొటియా గ్రామాల ప్రజలు పాల్గొనకుండా ఒడిశా అధికారులు 21 వివాదాస్పద గ్రామాలను అష్టదిగ్బంధం చేశారు. ఈ నెల 5వ తేదీన మండలంలో జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో(స్థానిక ఎన్నికలు)వివాదస్పద కొటియా గ్రామాల ప్రజలు పాల్గొనకుండా చేసేందుకు గత పది రోజులుగా ఒడిశా యంత్రాంగం, అధికార, ప్రతిపక్ష నాయకులు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఒడిస్సా అధికారుల ఆగడాలు శ్రుతి మించడంతో ప్రజలు తిరగబడ్డారు. కాగా ఈ విషయమై ఏపీ ప్రభుత్వం, అధికారుల తీరు ప్రజలకు అంతు పట్టడం లేదు. దీంతో ఈనెల ఐదవ తేదీన జరగనున్న ఎన్నిక సందర్భంగా ఏం జరగనుందో వేచి చూడాల్సి ఉంది.

పోలీసులపై తిరగబడ్డ ప్రజలు

ఒడిస్సా పోలీసుల చేష్టలు చూసి ఒడిశా పోలీసులపై తిరగబడ్డ కొటియా ప్రజలు. బారికేడ్లను విసిరేసి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివాదస్పద కొటియా గ్రూపు గ్రామాల ప్రజలు ఒడిశా పోలీసులు, అధికారులపై తిరగబడ్డారు. మొన్న అంతేకాకుండా ఆయా గ్రామాల ప్రజలకు ఏపీ ప్రభుత్వం అందజేసేందుకు లారీపై తీసుకు వెళుతున్న రేషన్ బియ్యాన్ని సైతం ఒడిశా అధికారులు అడ్డుకున్నారు. ఒడిస్సా అధికారులు చేష్టలను గమనించిన దొరల తాడి వలస, మూల తాడివలస తదితర గ్రామాల ప్రజలు మూకుమ్మడిగా తరలి వెళ్లి ఒడిశా అధికారులు, పోలీసులపై మండిపడ్డారు. కోటియా గొడవ అంటే చిన్న గొడవ కాదు. 90 ఏళ్ల నాటి సరిహద్దు గొడవ.

కోటియా గ్రామాలు ఎన్ని?

Advertisement

మొత్తం కోటియా పంచాయతీలో 28 గ్రామాలు ఉన్నాయి. అందులో 21 గ్రామాల మీదే గొడవ. ఒడిశా అంటుంది – 28 గ్రామాలు మావే అని, కోరాపుట్ జిల్లా, పొట్టంగి బ్లాక్ లోనివి అని అంటుంది. ఏపీనేమో 21 గ్రామాలు మావే, పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మండలంలోనివి అని అంటున్నాయి. దీంతో అక్కడ ఉండేది సుమారు 15,000 మంది. వాళ్లలో 3,900 మంది ఓటర్లు ఉన్నట్టు అక్కడి అధికారులు తెలిపారు.

Also read: సొరకాయ పచ్చి కారం కూర ఇలా చేస్తే..ఒక్క ముద్ద కూడా వదలరు!

Tags

Related News

ఏపీలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ వాయిదా!

ఏపీలో పూర్తిగా ఉనికి కోల్పోయిన వైసీపీ.. ఎమ్మెల్యే బోండా సంచలన వ్యాఖ్యలు?

బిగ్ టీవీ ఎఫెక్ట్.. కోనసీమ వరద బాధితులకు చేరిన సాయం!

పరిషత్ ఎన్నిక‌ల్లో క్లీన్‌స్వీప్ ల‌క్ష్యం.. కూటమి నేతలతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్

గోదావరి జిల్లాలో దంచికొడుతున్న వర్షం.. వరదలో చిక్కుకు పోయిన ఎన్నికల సిబ్బంది!

పరిషత్ ఎన్నికల పోలింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్.. మూడు మండలాలు మాత్రమే, షెడ్యూల్ ప్రకారమే..

తిరుపతి కార్పొరేషన్‌లో బీజేపీకి షాక్.. ఓడిపోయిన జిల్లా, నగర అధ్యక్షులు!

Big Stories

Advertisement
×