E-Paper
Advertisement

ఏపీలో డీఎస్సీ-2026 నోటిఫికేషన్ రిలీజ్.. 2721 పోస్టులు భర్తీ, నవంబర్ 11 నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఏపీలో డీఎస్సీ-2026 నోటిఫికేషన్ రిలీజ్.. 2721 పోస్టులు భర్తీ, నవంబర్ 11 నుంచి దరఖాస్తుల స్వీకరణ
Advertisement

AP DSC-2026: చెప్పినట్టుగానే కూటమి సర్కార్ చేసింది. ప్రతీ ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చింది. అన్నట్లుగానే ఈసారి కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకవిధంగా చెప్పాలంటే ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. 2721 ఖాళీలకు ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్ 11 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది.

ఏపీలో డీఎస్సీ-2026 నోటిఫికేషన్ విడుదల

ఏపీ ప్రభుత్వం డీఎస్సీ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్ధరాత్రి 12 గంటల నోటిఫికేషన్ విడుదలైంది. ఈసారి 2721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరణ నవంబర్ 11 నుంచి ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నియామకాలను ప్రకటిస్తూ అక్టోబర్ 13న విడుదల చేసిన నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా బుధవారం రాత్రి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.

నవంబర్ 11 నుంచి దరఖాస్తుల స్వీకరణ

Advertisement

డీఎస్సీ ద్వారా ఈసారి 2721 టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది. అందులో 2111 రెగ్యులర్‌ స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు ఉన్నాయి. 150 స్కూల్‌ అసిస్టెంట్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌, 200 ఎస్‌జీటీ స్కూల్‌ అసిస్టెంట్‌లతోపాటు ప్రిన్సిపాల్‌, పీజీటీ, టీజీటీ, ఫిజికల్‌ డైరెక్టర్‌ ఉద్యోగాలు మరో 260 ఉన్నాయి. క్రీడా కోటా అభ్యర్థులు రాత పరీక్ష రాయాల్సి వుంటుంది. అభ్యర్థులు నవంబర్ 11 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు విధానం, చివరి తేదీ, ఫీజు చెల్లింపు, ఇతర వివరాలు నోటిఫికేషన్‌లో ప్రస్తావించింది. జిల్లా వారీ, సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు ఇచ్చింది. డీఎస్సీ పరీక్ష డిసెంబరు 20 నుంచి వచ్చే ఏడాది జనవరి 13 వరకు జరుగుతాయి.

ALSO READ: ఏపీలో ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు, భారీగా బలగాలు మోహరింపు

Advertisement

డీఎస్సీ పరీక్షలు సీబీటీ విధానంలో నిర్వహిస్తుంది ప్రభుత్వం. ఆన్‌లైన్‌ మాక్‌టెస్ట్‌ డిసెంబరు 5 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ డిసెంబరు 14 నుంచి చేసుకోవచ్చు. పరీక్ష పూర్తయిన రెండు రోజులకే ప్రాథమిక కీ విడుదల చేయనుంది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు వారం రోజులు గడువు ఇవ్వనున్నారు. మరో వారం తర్వాత తుది కీ విడుదల కానుంది. పోస్టుల భర్తీకి సంబంధించి రిజర్వేషన్‌ అంశం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

Related News

ఏపీలో ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు, భారీగా బలగాలు మోహరింపు

ఏపీలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ వాయిదా!

కొటియా సరిహద్దుల్లో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత.. 21 గ్రామాలను ముట్టడించిన పోలీసులు!

ఏపీలో పూర్తిగా ఉనికి కోల్పోయిన వైసీపీ.. ఎమ్మెల్యే బోండా సంచలన వ్యాఖ్యలు?

బిగ్ టీవీ ఎఫెక్ట్.. కోనసీమ వరద బాధితులకు చేరిన సాయం!

పరిషత్ ఎన్నిక‌ల్లో క్లీన్‌స్వీప్ ల‌క్ష్యం.. కూటమి నేతలతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్

గోదావరి జిల్లాలో దంచికొడుతున్న వర్షం.. వరదలో చిక్కుకు పోయిన ఎన్నికల సిబ్బంది!

Big Stories

Advertisement
×