E-Paper
Advertisement

ఏపీలో ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు, భారీగా బలగాలు మోహరింపు

ఏపీలో ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు,  భారీగా బలగాలు మోహరింపు
Advertisement

Parishad Elections in AP: కొత్త జిల్లాలు ఏర్పాటు తర్వాత తొలిసారి ఏపీలో జిల్లా పరిషత్, ఎంపీపీ ఎన్నికలు జరుగుతున్నాడు. గురువారం ఉదయం నుంచి 7గంటల నుంచి పోలింగ్ మొదలైంది. జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించింది రాష్ట్ర ఎన్నికలు కమిషనర్. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

ఏపీలో మొదలైన ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు తర్వాత తొలిసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 659 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 77 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 582 జడ్పీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతోంది.

Advertisement

ఎన్నికల బరిలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 2,169 మంది అభ్యర్థులు ఉణ్నారు. వైసీపీ తరపున అత్యధికంగా 574 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీడీపీ-452 మంది, జనసేన – 109, బీజేపీ-34, కాంగ్రెస్-270, బీఎస్పీ- 107, సీపీఎం-47, ఆప్ నుంచి 9 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరికితోడు స్వతంత్ర అభ్యర్థులుగా 503 మంది బరిలో నిలిచారు. ఇతర పార్టీల నుంచి మరో 64 మంది అభ్యర్థులు ఉన్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు, భారీగా బలగాలు మోహరింపు

ఏపీ వ్యాప్తంగా ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. 9,829 ఎంపీటీసీ స్థానాలకు గాను 2043 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
మిగిలిన 7844 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఉదయం పోలింగ్ మొదలైంది. ఎన్నికల బరిలో మొత్తం 18952 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వైసీపీ నుంచి అత్యధికంగా 7632 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ-6,423 మంది జనసేన నుంచి-1521, కాంగ్రెస్-326, బీజేపీ-285 మంది పోటీలో ఉన్నారు. ఇక సీపీఎం-259, బీఎస్పీ-133 మంది, ఆప్-3, ఇతర పార్టీల నుంచి 131 మంది, స్వతంత్ర అభ్యర్థులుగా 2239 మంది బరిలో నిలిచారు. ఓట్ల లెక్కింపు ఈనెల 7న అంటే శనివారం జరగనుంది.

Advertisement

పరిషత్‌ ఎన్నికలు కావడంతో పోలింగ్‌కి గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. రాయలసీమలోని సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలు మోహరించాయి. నంద్యాల, అన్నమయ్య, కడప, తిరుపతి జిల్లాల్లో ఏపీఎస్పీకి చెందిన 111 ప్లటూన్ల అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. పల్నాడు జిల్లాలోని అదనపు బలగాలు మోహరించాయి.

ALSO READ: ఏపీలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ వాయిదా!

Related News

ఏపీలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ వాయిదా!

కొటియా సరిహద్దుల్లో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత.. 21 గ్రామాలను ముట్టడించిన పోలీసులు!

ఏపీలో పూర్తిగా ఉనికి కోల్పోయిన వైసీపీ.. ఎమ్మెల్యే బోండా సంచలన వ్యాఖ్యలు?

బిగ్ టీవీ ఎఫెక్ట్.. కోనసీమ వరద బాధితులకు చేరిన సాయం!

పరిషత్ ఎన్నిక‌ల్లో క్లీన్‌స్వీప్ ల‌క్ష్యం.. కూటమి నేతలతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్

గోదావరి జిల్లాలో దంచికొడుతున్న వర్షం.. వరదలో చిక్కుకు పోయిన ఎన్నికల సిబ్బంది!

పరిషత్ ఎన్నికల పోలింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్.. మూడు మండలాలు మాత్రమే, షెడ్యూల్ ప్రకారమే..

Big Stories

Advertisement
×