Pulivendula: స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు నిలుపుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి అధికార టీడీపీ-విపక్ష వైసీపీ. గురువారం జరుగుతున్న ఎంపీపీ, జెడ్‌పీపీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉమ్మడి కడప జిల్లాల్లో అక్కడక్కడ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అంతేకాదు ఒకరిపై మరొకరు రాళ్లు, టపాసులతో దాడులు చేసుకున్నారు ఆ రెండు పార్టీల కార్యకర్తలు.
ఏపీలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడక్కడ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాయలసీమలోని ఉమ్మడి కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పోలింగ్ సందర్భంగా ఘర్షణలు జరిగాయి. టీడీపీ-వైపీసీ కార్యకర్తల మధ్య దాడులు చోటు చేసుకున్నాయి. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకోవడం, టపాసుకులు విరుసుకోవడం కనిపించింది. ఈలోగా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కార్యకర్తలు సైడ్ అయ్యారు.
కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రపల్లెలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ-టీడీపీ మధ్య దాడులు జరిగాయి. దీంతో రెచ్చిపోయిన ఇరువర్గాలు.. ఒకరిపై మరొకరు రాళ్లు, కర్రలు, టపాసులతో దాడులు చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కాసేపు టెన్షన్ నెలకొంది. ఘర్షణల విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల ప్రజలు అక్కడి నుంచి జారుకున్నారు.
ALSO READ: ఎన్నికల పోలింగ్ వేళ చంద్రగిరిలో ఊహించని సీన్.. ఇది మామూలు ర్యాగింగ్ కాదు, ఏకంగా చెవిరెడ్డికే
పులివెందులలో ఘర్షణ.. టపాకాయలు, రాళ్లతో దాడి
కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రిపల్లెలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు టపాకాయలు, పొగ బాంబులు, రాళ్లతో దాడి చేసుకున్నాయి. #Pulivendula #Erripalle #KadapaPolitics #APParishadElections #TDPvsYCP #bigtv pic.twitter.com/KSqsXoD0L2
— BIG TV Breaking News (@bigtvtelugu) November 5, 2026