E-Paper
Advertisement

ఎన్నికల పోలింగ్ వేళ చంద్రగిరిలో ఊహించని సీన్.. ఇది మామూలు ర్యాగింగ్ కాదు, ఏకంగా చెవిరెడ్డికే

ఎన్నికల పోలింగ్ వేళ చంద్రగిరిలో ఊహించని సీన్..  ఇది మామూలు ర్యాగింగ్ కాదు, ఏకంగా చెవిరెడ్డికే
Advertisement

Chandragiri constituency: ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేళ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ-వైసీపీ కీలక మధ్య నేతల అనుకోని దృశ్యం దర్శనమిచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని భార్య సుధారెడ్డి ఓ రేంజ్‌లో ఆరేసుకున్నారు. దీంతో షాకవ్వడం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి వంతైంది. అసలు ఏం జరిగింది?

ఎన్నికల పోలింగ్ వేళ చంద్రగిరిలో ఊహించని సీన్

ఏపీలో ఎంటీసీపీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ అంతా ప్రశాతంగా జరుగుతోంది. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల పోలింగ్ కావడంతో అధికార-విపక్షాలకు చెందిన నేతలు ఎవరికి వారు పైచేయి సాధించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. తాజాగా చంద్రగిరి నియోజకవర్గం గత ఎన్నికల వరకు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అడ్డంగా ఉండేది.

Advertisement

మొన్నటి ఎన్నికల్లో అక్కడ వైసీపీ ఓటమి పాలైంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ప్లాన్ చేశారు. పోలీసులతో కలిసి పోలింగ్ జరుగుతున్న ఏరియాల్లో ఆయన తిరుగుతున్నారు. ఆ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని సుధారెడ్డి ఎంట్రీ కావడంతో చెవిరెడ్డి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. పోలీసుల ముందు ఓ వ్యక్తిని చెడుగుడు ఆడేశారు. దెబ్బకు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి షాకయ్యారు.

ఖంగుతిన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి

తాను మాట్లాడుతుంటే వీడియోలో కనిపించవచ్చని, ఆయన ఫాలో అవుతున్నారంటూ చురకలు వేశారు. చెవిరెడ్డి ఎక్కడికి వెళ్లకుండా అక్కడికక్కడే కంట్రోల్ చేశారు సుధారెడ్డి. గతంలో జిల్లా కలెక్టరు, ఎస్పీలను చూశారంటూ వైసీపీపై కామెంట్స్ చేశారు. చెవిరెడ్డి భయపడే రకం కాదని, మా అన్న అంటూ సంభోధించారు. పోలింగ్ జరుగుతున్న ప్రాంతాలకు కలిసే వెళ్దామంటూ చెవిరెడ్డికి చెప్పారు సుధారెడ్డి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హంగామా చేస్తోంది.

Advertisement

ALSO READ: ఏపీలో డీఎస్సీ-2026 నోటిఫికేషన్ రిలీజ్.. 2721 పోస్టులు భర్తీ, నవంబర్ 11 నుంచి దరఖాస్తుల స్వీకరణ

అవసరమైతే నేతలతో ఒకే కారులో కలిసి వెళ్తామని సుధారెడ్డి అన్నారు. సుధారెడ్డి సూచనతో కంగుతిన్నారు మాజీ ఎమ్మెల్యే. సైలెంటుగా అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేశారు. చెవిరెడ్డి ఎటు వైపు వెళ్తుంటే అటు వైపే వెళ్దామని చెప్పి ఆయన్ని ఫాలో అయ్యారు టీడీపీ ఎమ్మెల్యే భార్య.

 

Related News

ఏపీలో డీఎస్సీ-2026 నోటిఫికేషన్ రిలీజ్.. 2721 పోస్టులు భర్తీ, నవంబర్ 11 నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఏపీలో ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు, భారీగా బలగాలు మోహరింపు

ఏపీలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ వాయిదా!

కొటియా సరిహద్దుల్లో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత.. 21 గ్రామాలను ముట్టడించిన పోలీసులు!

ఏపీలో పూర్తిగా ఉనికి కోల్పోయిన వైసీపీ.. ఎమ్మెల్యే బోండా సంచలన వ్యాఖ్యలు?

బిగ్ టీవీ ఎఫెక్ట్.. కోనసీమ వరద బాధితులకు చేరిన సాయం!

పరిషత్ ఎన్నిక‌ల్లో క్లీన్‌స్వీప్ ల‌క్ష్యం.. కూటమి నేతలతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్

Big Stories

Advertisement
×