E-Paper
Advertisement

ఏపీలో పూర్తిగా ఉనికి కోల్పోయిన వైసీపీ.. ఎమ్మెల్యే బోండా సంచలన వ్యాఖ్యలు?

ఏపీలో పూర్తిగా ఉనికి కోల్పోయిన వైసీపీ.. ఎమ్మెల్యే బోండా సంచలన వ్యాఖ్యలు?
Advertisement

AP Local Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అఖండ విజయం కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు అని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కూటమి సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు ఇచ్చిన తిరుగులేని తీర్పు ఇదని, గతంలో నామినేషన్ల వేళ పులివెందుల, పుంగనూరుల్లో విధ్వంసాలకు పాల్పడ్డ వైసీపీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పారని అన్నారు. స్థానిక సంస్థల ఫలితాలతో రాష్ట్రంలో పూర్తిగా ఉనికి కోల్పోయిన వైసీపీ 27 నెలల్లో సంక్షేమానికే రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని అన్నారు.

రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు..

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రూ.75 వేల కోట్లు వెచ్చించి పేదలకు అండగా నిలిచామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ‘తల్లికి వందనం’ హామీని విజయవంతంగా అమలు చేశామని, అన్న క్యాంటీన్లు ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నామన్నారు. యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, నిరంతర డీఎస్సీలు, పోలీసు నియామకాలు, మహిళలకు 50 శాతం, బీసీలకు 40 శాతానికి పైగా సీట్లు కేటాయించి సామాజిక న్యాయం చేశామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులే దొరక్క పూర్తిగా ఉనికి కోల్పోయిన వైసీపీ అని అన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు, విష ప్రచారాలు చేయడం ఇప్పటికైనా వైసీపీ మానుకోవాలని అన్నారు.

‘గొడ్డలి పార్టీ’ ఆగడాలు..

Advertisement

పుంగనూరు, పులివెందులలో నామినేషన్ల సమయంలో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో కార్లు తగలబెట్టి రక్తపాతం సృష్టించారు. 2021 స్థానిక ఎన్నికల్లో మాచర్లలో నాపై సాక్షాత్తు ప్రాణాంతక దాడి చేసిన విషయాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అని అన్నారు. గెలిస్తే ఈవీఎంలు మంచివి, ఓడిపోతే తప్పు అనడం వైసీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అని, బ్యాలెట్ పేపర్లతో నిర్వహించిన స్థానిక ఎన్నికల్లోనూ వైసీపీకి ఘోర పరాభవం తప్పలేదని అన్నారు. ‘గొడ్డలి పార్టీ’ ఆగడాలను నిశితంగా గమనించిన ప్రజలు కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఆ పార్టీ అడ్రస్ గల్లంతు చేశారు. రూ.50 వేల కోట్లతో పట్టణాల అభివృద్ధి.. వేల కిలోమీటర్ల డ్రైనేజీ నిర్మాణాలు, 502 కొత్త పార్కుల ఏర్పాటు తుఫానులొచ్చినా పట్టించుకోని అసమర్థ పాలన వైసీపీదని, నేడు ప్రకృతి విపత్తుల్లోనూ ప్రజలకు అండగా నిలిచింది కూటమి ప్రభుత్వం అంటూ కొనియాడారు.

Also Read: ట్రిప్‌కి వెళ్లి గాల్లో కలిసిపోయింది… 20 ఏళ్లైనా కూతురి కోసం ఆగని తల్లి పోరాటం… చూస్తే కన్నీళ్లు ఆగవు ​

Tags

Related News

బిగ్ టీవీ ఎఫెక్ట్.. కోనసీమ వరద బాధితులకు చేరిన సాయం!

పరిషత్ ఎన్నిక‌ల్లో క్లీన్‌స్వీప్ ల‌క్ష్యం.. కూటమి నేతలతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్

గోదావరి జిల్లాలో దంచికొడుతున్న వర్షం.. వరదలో చిక్కుకు పోయిన ఎన్నికల సిబ్బంది!

పరిషత్ ఎన్నికల పోలింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్.. మూడు మండలాలు మాత్రమే, షెడ్యూల్ ప్రకారమే..

తిరుపతి కార్పొరేషన్‌లో బీజేపీకి షాక్.. ఓడిపోయిన జిల్లా, నగర అధ్యక్షులు!

పార్టీల మద్దతు ఉంటే సరిపోదు భయ్యా.. క్షేత్రస్థాయిలో ఏబీవీ ఎక్కడ విఫలమయ్యారంటే?

బెజవాడ బాద్‌షా వంగవీటి రాధా.. రికార్డు మెజారిటీతో మేయర్ పీఠం కైవసం!

Big Stories

Advertisement
×