Mustafizur Rahman To Skip BBL: బిగ్ బాష్ లీగ్ 2026-2027 టోర్నమెంట్ (Big Bash League 2026-2027 tournament) హిస్టారిక్ ఓపెనింగ్ మ్యాచ్ ఇండియాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ (Mustafizur Rahman) సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఇండియాలో జరగబోతున్న ఈ తొలి మ్యాచ్ కు తాను అందుబాటులో ఉండబోనని ఇప్పటికే మెల్ బోర్న్ రెనెగేడ్స్ (Melbourne Renegades) జట్టు యాజమాన్యానికి సమాచారం అందించాడు.
ఇండియా, బంగ్లాదేశ్ మధ్య పరిస్థితులు బాగా లేవని.. ఈ తరుణంలోనే ఇండియాలో తనకు సరైన సెక్యూరిటీ ఏర్పాట్లు ఉండకపోవచ్చు అని ముస్తాఫిజుర్ రెహమాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మొదటి మ్యాచ్ మినహాయించి మిగతా టోర్నమెంట్ మొత్తం ఆడతానని ఫ్రాంచైజీకి సమాచారం ఇచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ముస్తాఫిజుర్ రెహమాన్ తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కంటే ముందు హిందువులపై బంగ్లాదేశ్ లో దాడులు జరిగాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు ఐపీఎల్ ఆడకుండా బ్యాన్ వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో గత సీజన్ లో ఏ ఒక్క బంగ్లా ప్లేయర్ కూడా ఐపీఎల్ ఆడలేదు. అటు బంగ్లాలో కూడా ఐపీఎల్ ప్రసారాలు నిలిపివేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సంఘటన జరిగిన నుంచి ఇప్పటి వరకు బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు కూడా జరగడం లేదు.
ఇప్పటికే జరగాల్సిన టి20 వన్డే సిరీస్ కూడా వాయిదా పడుతూ సర్వస్తోంది. ఇలాంటి క్రమంలో బిగ్ బాష్ లీగ్ ఓపెనింగ్ మ్యాచ్ కోసం తాను చెన్నైకి వస్తే అక్కడే పాతరేస్తారని ముస్తాఫిజర్ రెహమాన్ వణికి పోతున్నాడట. అందుకే తెలివిగా తనకు అదే రోజున యూఏఈకి చెందిన అంతర్జాతీయ టి20 లీగ్ మ్యాచ్ ఉందని తప్పించుకున్నట్టు తెలుస్తోంది. కాగా గాయం కారణంగా దూరమైన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జేసన్ స్థానంలో బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ (Mustafizur Rahman)ను మెల్ బోర్న్ రెనెగేడ్స్ (Melbourne Renegades) ఫ్రాంచైజీ తీసుకుంది.
బిగ్ బాస్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియాలో తొలి మ్యాచ్ జరగనుంది. డిసెంబర్ 12వ తేదీన చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా మెల్బోర్న్ రెనెగెడ్స్ వర్సెస్ ఎర్త్ స్కార్చర్స్ జట్ల మధ్య ఈ ఫైట్ ఉంటుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలోనే మిగిలిన మ్యాచ్ లు ఉంటాయి.