BigTV English

Swami Swaroopananda Comments: చంద్రబాబు గెలవాలని పూజలు చేశా.. అందుకే..!!

Swami Swaroopananda Comments: చంద్రబాబు గెలవాలని పూజలు చేశా.. అందుకే..!!

Swami Swaroopananda Comments on Chandrababu Victory: చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఆనందంగా ఉందని శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి అన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముహూర్తం బలమైందని తెలిపారు. చంద్రబాబు ప్రజలకు మేలు కలిగేలా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పరిపాలించాలని అన్నారు. కేంద్రంలో ఉండే సన్నిహిత సంబంధాలతో చంద్రబాబు గొప్పగా పాలించగలరని ఆశిస్తున్నామని తెలిపారు.


అమరావతిలో కూడా శారదాపీఠం నిర్మిస్తామని తెలిపారు. ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా రాజశ్యామల అమ్మవారి ఆశిస్సులు ఉంటాయని చెప్పారు. త్వరలోనే చాతుర్యాస పూజల కోసం రుషికేశ్ వెళ్తున్నాం.. అందుకే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే ఆశీస్సులు అందిస్తున్నామని వెల్లడించారు. తనకు అత్యంత సన్నిహితుడైన ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రి కావడం సంతోషంగా ఉందని తెలిపారు.

అమ్మవారి కృపతో మోదీ మూడో సారి ప్రమాణ స్వీకారం చేయడం ఆనందం కలిగించిందన్నారు. చంద్రబాబును కొత్తగా పొగుడుతున్నానని అనుకోవద్దన్న ఆయన.. చంద్రబాబు గెలుపు కోసం గతంలో మురళిమోహన్‌తో కలిసి సాధువులందరితో సమావేశం పెట్టి పూజలు చేశాం అని తెలిపారు. చతుర్మాస దీక్ష అనంతరం హైదరాబాద్‌లోని శారదాపీఠంలో స్థిరపడాలని అనుకుంటున్నట్లు చెప్పారు


Also Read: రాజీపడే ప్రసక్తే లేదు.. చట్టానికి లోబడే మీకు గట్టిగా బుద్ధి చెబుతాం: పట్టాభిరామ్

తనపై, శారదాపీఠంపై తప్పుడు అభిప్రాయాలు వెల్లడించకుండా ఉండాలని మీడియాకు తెలిపారు. తనకు చంద్రబాబు అంటే గౌరవం అని చెప్పారు. చంద్రబాబు చాలా సీనియర్ నేత అని.. మరి కొన్ని కాలాలపాటు ఆయురారోగ్యాలతో చంద్రబాబు బాగుండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ సారైనా దేవాలయాల పాలన బాగుండేలా చూడాలని తెలిపారు.

Related News

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: లిక్కర్ కేసులో కొత్త విషయాలు.. ముడుపుల చేర్చడంలో వారే కీలకం, బిగ్‌బాస్ చుట్టూ ఉచ్చు

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Big Stories

×