BigTV English

TDP-JanaSena-BJP alliance: తేలని పొత్తుల లెక్కలు.. పునరాలోచనలో చంద్రబాబు..

TDP-JanaSena-BJP alliance: తేలని పొత్తుల లెక్కలు.. పునరాలోచనలో చంద్రబాబు..
TDP-JanaSena-BJP alliance

TDP-JanaSena-BJP alliance(AP election news today telugu): పార్టీ నేతలతో భేటీ అవుతున్నజనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సీట్ల లెక్కుల వేసుకుంటున్నారు. గోదావరి జిల్లాల టూర్‌కు రెడీ అయిన ఆయన చంద్రబాబును కలిసి సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు. జనసేన, బీజేపీలకు కలిపి కేటాయించాల్సిన సీట్లపై ఒక ఫిగర్‌కు ఫిక్స్ అయిన జనసేనాని.. ఆ దిశగా చంద్రబాబుతో చర్చించనున్నారు. ఆ లెక్కలు తేల్చడానికి బీజేపీ పెద్దలు డెడ్‌లైన్ పెట్టారంటున్నారు. అయితే ఆ రెండు పార్టీలు అడుగుతున్న సీట్ల సంఖ్యపై టీడీపీ అధినేత పునరాలోచనలో పడ్డారంట.. పొత్తుకు సంబంధించిన ప్రకటన ఆ సంఖ్య దగ్గరే ఆగిందంట.


ఎన్నికలకు గడువు దగ్గరపడుతున్నా ఏపీలో పొత్తుల లెక్కలు తేలడం లేదు. సీట్ల సర్దుబాటుపై చర్చించడానికి జనసేన, టీడీపీ అధ్యక్షులు మరోసారి సమావేశం కానున్నారు. ఆ భేటీ తర్వాత చంద్రబాబు మళ్లీ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా సీట్ల పంపకాలపై రెండు రోజుల్లో క్లారిటీ ఇవ్వాలని బీజేపీ డెడ్ లైన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో అతి త్వరలోనే పొత్తులపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.

అదలా ఉంటే జనసేన, బీజేపీలకి కలిపి 50 సీట్లు ఇవ్వాలని చంద్రబాబు ముందు ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ ఫిగర్ దగ్గరే పొత్తుల ప్రకటన ఆగిందంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో తమ మద్దతు అవసరముండేలా ఆ రెండు పార్టీలు పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే టీడీపీకి సోలోగా మేజిక్ ఫిగర్ దక్కకుండా చేయాలన్న ఆలోచన చేస్తున్నాయంట. 175 సీట్లున్న అసెంబ్లీలో అధికార పగ్గాలు చేపట్టాలంటే 88 సీట్లు అవసరం. అన్ని సీట్లు టీడీపీ సొంతగా గెలుచుకుంటే.. ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యత ఉండదన్న భయంతోనే.. బీజేపీ పెద్దలు జనసేనానితో కథ నడిపిస్తున్నారంటున్నారు.


అయితే జనసేన, బీజేపీలు కలిసి 50 అసెంబ్లీ కోరుతుండటంతో.. చంద్రబాబు పునరాలోచనలో పడ్డట్లు కనిపిస్తున్నారు. ఆ రెండు పార్టీలను 40 సీట్లకి లోపే పరిమితం చేయాలని టీడీపీ సీనియర్లు సూచిస్తుండటంతో.. చంద్రబాబు కూడా దానికే ఫిక్స్ అయ్యారంటున్నారు. అదీకాక ఈ ఎన్నికల్లో ఆయన కేంద్రం నుంచి కొన్ని హామీలు ఆశిస్తున్నారంట. పోలీసు, ఐటీ సపోర్ట్ సహా పలు కీలక హామీలు రాబట్టుకోవాలని చూస్తున్న చంద్రబాబు.. వాటిపై స్పష్టత ఇవ్వకుండా సీట్ల పంపకాలపై ముందుకెళ్లలేమని క్లారిటీ ఇచ్చారంటున్నారు.. అందుకే పవన్‌కళ్యాణ్‌తో భేటీ తర్వాత ఆయన మరోసారి ఢిల్లీ వెళ్లే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది.

సీట్ల సంఖ్య, హామీల దగ్గరే పొత్తుల ప్రకటన ఆగిందని.. రెండు మూడు రోజుల్లో ఏ విషయం తేలిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ, జనసేన ఇప్పటికే జగన్ ఓటమి లక్ష్యంగా పొత్తు ప్రకటించాయి. కొంత కాలంగా బీజేపీ వైఖరిపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు కూడా అతిత్వరలోనే తెర పడనుంది. 2014 తరహాలో మూడు పార్టీలు కూటమిగా పోటీ పై ప్రకటన లాంఛనంగా కనిపిస్తోంది. పదేళ్ల కాలం తరువాత ఏపీలో 2014 రాజకీయం రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసాయి. అప్పుడు మోడీ ఛరిష్మా, పవన్ మద్దతు, రాష్ట్రంలో పరిస్థితులు చంద్రబాబుకు కలిసి వచ్చాయి. టీడీపీ 102 సీట్లు, బీజేపీ 4, ఒక స్వతంత్ర అభ్యర్ది గెలిచారు. అప్పుడు పోటీకి దూరంగా ఉన్న జనసేన.. ఇప్పుడు బరిలోకి దిగుతుండటంతో సీట్ల సర్దుబాటు టీడీపీకి కీలకంగా మారింది. ఆ రెండు పార్టీలు అడుతున్నట్లు 50 సీట్లు కాకపోయినా కనీసం 35 నుంచి 40 సీట్లు వారికి కేటాయించాల్సి ఉంటుంది.

ఆ సీట్లు కోల్పోవటం టీడీపీలో ఆశావాహుల పైన ప్రభావం చూపించటం ఖాయం. వారితో పాటు టికెట్లు దక్కని పార్టీ నేతలను బుజ్జగించుకోవడం టీడీపీ అధిష్టానికి పెద్ద పనే.. ఇక సీట్లు సర్దుబాటు చేసుకుంటూ.. క్షేత్ర స్థాయిలో మూడు పార్టీల కేడర్ ను కలుపుకుంటూ.. ఎన్నికల్లోకి వెళ్లటం చంద్రబాబుకు పెద్ద టాస్కే అంటున్నారు. మరోవైపు గతంలో ఎన్డీఏ నుంచి ఏ కారణాలతో చంద్రబాబు బయటకు వచ్చారో.. ఇప్పటికీ ఆ హామీలు అమలు కాలేదు.. తిరిగి ఎన్డీఏలో చేరితే చంద్రబాబు ఆ హామీలపై జనానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది … ఇలాంటి పరిస్థితుల్లో పొత్తుల లెక్కలు మూడు పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతున్నాయి.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×