BigTV English

TDP MP Candidates First List: టీడీపీ ఎంపీ అభ్యర్థులపై చంద్రబాబు కసరత్తు.. నేడు తొలి జాబితా విడుదల..!

TDP MP Candidates First List: టీడీపీ ఎంపీ అభ్యర్థులపై చంద్రబాబు కసరత్తు.. నేడు తొలి జాబితా విడుదల..!
TDP MP Candidates First List
TDP MP Candidates First List

TDP MP Candidates First List: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. తొలి జాబితాను మంగళవారం రాత్రిలోపు విడుదల చేయాలని భావిస్తున్నారు. బుధవారం మరికొందరి పేర్లను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు సమాచారం.


ఏపీలో జనసేన, బీజేపీతో టీడీపీకి పొత్తు కుదిరింది. తెలుగుదేశం పార్టీ 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ, జనసేనకు కలిపి 8 స్థానాలు కేటాయించింది. ఇందులో బీజేపీ 6 చోట్ల, జనసేన రెండు స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఇప్పుడు 17 లోక్ సభ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు తుది దశకు చేరుకుంది. మంగళవారం 10 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం మిగతా పేర్లు ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు.

మరోవైపు టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన , బీజేపీకి కలిపి 31 స్థానాలు కేటాయించింది. ఇందులో జనసేన 21 చోట్ల, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తాయి. ఇప్పటికే 128 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. మరో 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే సమయంలోనే మిగిలిన స్థానాల ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది.


Also Read:  వైసీపీ ఫిర్యాదు.. చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు

మొత్తం 144 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 17 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ప్రచారంపై పూర్తిగా ఫోకస్ చేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో సభ నిర్వహించారు. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల ఉమ్మడి బహిరంగ సభను చిలకలూరిపేటలో నిర్వహించి సక్సెస్ చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలో రావాల్సిన ఆవశ్యకతను ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ వివరించారు. ఈ బహిరంగ సభ తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం మరింత పెరిగింది.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×