BigTV English

Municipal Chairperson Election: హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం, ఛైర్మన్‌గా రమేష్ ఎన్నిక

Municipal Chairperson Election: హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం, ఛైర్మన్‌గా రమేష్ ఎన్నిక

Municipal Chairperson Election: హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. అటు నెల్లూరు, ఏలూరులో కూడా టీడీపీ మద్దతుదారులుగా నిలిచారు. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం అయ్యింది. మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి రమేశ్ ఎన్నికయ్యారు. అయితే రమేశ్‌కు అనుకూలంగా 23 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్ధి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓటింగ్‌లో ఎమ్మెల్యే బాలకృష్ణ ఎంపీ పార్ధసారథి పాల్గొన్నారు.


దీంతో మున్సిపల్ చైర్మన్‌గా రమేశ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రమేశ్‌తో మున్సిపల్ కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రమేష్‌ను దగ్గరుండి సీట్‌లో కూర్చోబెట్టారు ఎమ్మెల్యే బాలకృష్ణ. అయితే కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. పార్టీ మారిన కౌన్సిలర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటు జై బాలయ్య అంటూ టీడీపీ కౌన్సిలర్లు నినాదాలు చేశారు.

ఈ తరుణంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూపురం మున్సిపల్ చైర్మన్‌గా ఆరో వార్డు కౌన్సిలర్ రమేష్ ఎన్నికైన సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. గత వైసీపీ పరిపాలనతో విసిగిపోయిన ఆ పార్టీ కౌన్సిలర్‌లు టీడీపీలోకి వచ్చారని పేర్కొన్నారు. టీడీపీకి మద్దతు ఇచ్చారని తెలిపారు. మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన రమేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


నెల్లూరులో రిజల్ట్.. 

నెల్లూరు కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. ఫైనల్‌గా నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా తహసీన్ ఎన్నిక అయ్యారు. టీడీపీ నుంచి 48వ డివిజన్ కార్పొరేటర్ తహసీన్‌కు అనుకూలంగా 41 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి కరిముల్లాకు 21 ఓట్లు వచ్చాయి. టీడీపీ, వైసీసీ నేతలు మైనార్టీలను నిలబెట్టడంతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది. దీంతో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఫలితం వచ్చేంది. 41ఓట్లతో నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా తహసీన్ ఎన్నికయ్యారు.

ఏలూరులోనూ టీడీపీదే హవా..

ఏలూరు డిప్యూటీ మేయర్ పదవులు కూడా టీడీపీ కైవసం అయ్యాయి. డిప్యూటీ మేయర్లుగా దుర్గాభవానీ, ఉమామహేశ్వరరావు ఎన్నికయ్యారు. అయితే ఇక్కడ రెండు నామినేషన్లు మాత్రమే రావడంతో…
డిప్యూటీ మేయర్లుగా ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారులు డిక్లేర్ చేశారు.

ఇటు నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 18 మంది మద్దతుతో టీడీపీ అభ్యర్ధి విజయం సాధించింది. మరోవైపు వైసీపీ అభ్యర్థి కేవలం 14 మంది మాత్రమే ఓటు వేశారు. దీంతో వైసీపీకి ఓటమి తప్పలేదు.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×