BigTV English

Kannappa: కన్నప్ప నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్.. గెటప్ అదుర్స్..!

Kannappa: కన్నప్ప నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్.. గెటప్ అదుర్స్..!

Kannappa:మంచు ఫ్యామిలీ ప్రెస్టేజియస్ మూవీగా వస్తున్న చిత్రం కన్నప్ప (Kannappa). భారీ బడ్జెట్ తో పాటు భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ కి సంబంధించిన పోస్టర్లను వదులుతూ క్యారెక్టర్ లను పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఇందులో అక్షయ్ కుమార్ (Akshay Kumar) శివుడి పాత్ర పోషిస్తూ ఉండగా.. కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) పార్వతీదేవి పాత్ర పోషిస్తున్నట్లు ఈమధ్య పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ ఏ పాత్రలో నటిస్తున్నారు? ఆయన క్యారెక్టర్ ఏంటి? ఆయన ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతోంది? అని తెలుసుకోవడానికి..అభిమానులు గత కొన్ని రోజు నుంచి తాపత్రయపడ్డారు. దీనికి తోడు ప్రభాస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం కోసం కన్నప్ప టీం కౌన్డౌన్ పేరిట పోస్టర్లను కూడా రిలీజ్ చేస్తూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈరోజు ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడం జరిగింది.


రుద్ర క్యారెక్టర్ లో ప్రభాస్ ..

ప్రభాస్ ఇందులో రుద్ర క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఈ మేరకు ప్రభాస్ లుక్ ని రివీల్ చేస్తూ మేకర్స్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఇందులో కాషాయ వస్త్రాలు ధరించి, చేతిలో కర్ర, నుదుట విభూది, మెడలో రుద్రాక్షలు, విగ్గుతో కనిపించడంతో అభిమానులు పూర్తిస్థాయిలో డిసప్పాయింట్ అవుతున్నారు.. మాస్ హీరోగా లవర్ బాయ్గా యాక్షన్ హీరోగా వివిధ పాత్రలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న ప్రభాస్ కి ఇలాంటి గెటప్ ఏమాత్రం సూట్ కాలేదని విమర్శలు గుప్పిస్తున్నార ఇక పోస్టర్ విషయానికి వస్తే.. ప్రభాస్ ను మునుపెన్నడు చూడని సరికొత్త క్యారెక్టర్ ను అభిమానులకు పరిచయం చేశారు కానీ ఈ క్యారెక్టర్ ఏ మాత్రం మెప్పించకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ పోస్టర్ తో పాటు.. ” ప్రళయ కాల రుద్రుడు.. త్రికాల మార్గదర్శకుడు.. శివాజ్ఞ పరిపాలకుడు.. రుద్ర ..” అంటూ ఒక క్యాప్షన్ కూడా జోడించారు మేకర్స్. ఇక ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


నిరాశ పరుస్తున్న పోస్టర్స్..

ఇదిలా ఉండగా ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక విమర్శను ఎదుర్కొంటూనే ఉంది.ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు కూడా భారీ ట్రోల్స్ ఎదుర్కొన్నాయి.అందుకే కనీసం ప్రభాస్ లుక్ అయినా విడుదల అయితే.. ఆ పోస్టర్ కి పాజిటివ్ బస్ ఏర్పడితే ఇప్పటివరకు వివిధ పోస్టర్లపై వచ్చిన ట్రోల్స్ ఆగిపోతాయేమో అని చిత్ర బృందం అనుకుంది. అయితే అలా అనుకున్నప్పుడైనా కాస్త జాగ్రత్త వహించాల్సింది. ఒక పాన్ ఇండియా హీరోని లక్షల మంది అభిమానులు ఉన్న హీరోని ఇలా ఒక సాధువు రూపంలో చూపించేసరికి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

వాస్తవానికి ఈ మూవీలో ప్రభాస్ నందీశ్వరుడి పాత్రను పోలి ఉంటుంది. నందీశ్వరుడు అంటే.. భీకరంగా, గంభీరంగా కనిపిస్తాడని ఫ్యాన్స్ అనుకున్నారు. నిజానికి ముందుగా ఈ సినిమాలో ఈశ్వరుడి పాత్రను డార్లింగ్ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ, ఈశ్వరుడి పాత్రను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కి ఇచ్చారు. ఇక్కడే ప్రభాస్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. నందీశ్వరుడి పాత్ర అయినా… ప్రభాస్ కు సెట్ అవుతుందని కంప్రమైజ్ అయ్యారు. కానీ, ఇప్పుడు ప్రభాస్ లుక్ ను చూసి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. గంభీరంగా చూపించాల్సిన ప్రభాస్ పాత్రను ఇంత డీలాగా చూపించారు అంటూ మంచు విష్ణు పై మండి పడుతున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ ఉన్నాడు కాబట్టే ఇంత బజ్ ఉందని, అలాంటిది ప్రభాస్ లుక్ ను ఇంత దారుణంగా డిజైన్ చేశారు అంటూ ఫైర్ అవుతున్నారు.

Related News

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

Big Stories

×