BigTV English

Busiest Railway Stations: దేశంలో అత్యంత రద్దీ రైల్వే స్టేషన్లు.. ఒక్కో స్టేషన్ నుంచి ఎన్ని రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయంటే?

Busiest Railway Stations: దేశంలో అత్యంత రద్దీ రైల్వే స్టేషన్లు.. ఒక్కో స్టేషన్ నుంచి ఎన్ని రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయంటే?

Indian Railways: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్ధల్లో ఇండియన్ రైల్వే ఒకటి. భారతీయ రవాణా వ్యవస్ధలో కీలకపాత్ర పోషిస్తున్నది. దేశ వ్యాప్తంగా సుమారు 7,300 పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటి ద్వారా నిత్యం వేలాది రైళ్లు ప్రయాణిస్తాయి. లక్షలాది మంది ప్రయాణీకులను, టన్నుల కొద్ది సరుకులను రవాణా చేస్తాయి. అయితే, దేశంలో అత్యంత రద్దీగా ఉండే టాప్ రైల్వే స్టేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


⦿హౌరా జంక్షన్- పశ్చిమ బెంగాల్

దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. మొత్తం 23 ప్లాట్‌ ఫామ్‌ లను కలిగి ఉంటుంది. ఈ జంక్షన్ నుంచి ప్రతి రోజూ 1,000 కంటే ఎక్కువ రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి.  కోల్‌ కతాను దేశంలోని వివిధ ప్రాంతాలకు కలుపుతుంది ఈ రైల్వే జంక్షన్. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అతిపెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.  ⦿న్యూఢిల్లీ రైల్వే స్టేషన్


దేశ రాజధాని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ లో దేశంలో అత్యంత రద్దీగా ఉండే రెండో స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ స్టేషన్ లో మొతం 16 ప్లాట్‌ ఫారమ్‌ లు ఉన్నాయి. ప్రతిరోజూ 350 కి పైగా రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి.  ఈ స్టేషన్ నుంచి నిత్యం 5,00,000 మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తాయి. పీక్ ఫెస్టివల్ సీజన్లలో ఈ సంఖ్య 6,00,000 వరకు పెరుగుతుంది.

⦿కాన్పూర్ సెంట్రల్- ఉత్తర ప్రదేశ్

దేశంలో ఎక్కువ రద్దీ ఉండే స్టేషన్లలో ఇదీ ఒకటి. ఇక్కడ మొత్తం 10 ప్లాట్‌ ఫారమ్‌ లు ఉంటాయి. నిత్యం 1,000కి పైగా రైళ్లు రాకపోకలను కొనసాగిస్తాయి. ఇక్కడి నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు నెట్ వర్క్ విస్తరించి ఉంది. ఇది ఉత్తర రైల్వే లో కీలకమైన లింక్ గా ఉంది. దేశంలో మూడవ అత్యంత రద్దీ స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

⦿ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్- ముంబై

ఇక్కడ మొత్తం 18 రైల్వే స్టేషన్లు ఉంటాయి. దేశంలో అత్యంత రద్దీగా ఉండే నాల్గవ రైల్వే స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది. నిత్యం ఇక్కడి నుంచి లక్షలాది మంది ప్రయాణీకులు దేశంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు కొనసాగిస్తారు.

⦿చెన్నై సెంట్రల్- తమిళనాడు

ఇది తమిళనాడులోని ప్రధాన రైల్వే స్టేషన్. 15 ప్లాట్‌ ఫామ్‌ లు ఉంటాయి. ప్రతి రోజూ 500కు పైగా రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి. రోజూ దాదాపు 5,50,000 మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తారు.  ఇది మూర్ మార్కెట్ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్, చెన్నై సెంట్రల్ మెట్రో స్టేషన్, చెన్నై పార్క్ రైల్వే స్టేషన్, చెన్నై పార్క్ టౌన్ రైల్వే స్టేషన్‌లకు కలిపి ఉంటుంది.

⦿పాట్నా జంక్షన్- బీహార్

ఇది బీహార్‌ లోని కీలకమైన రైల్వే స్టేషన్‌. 10 ఫ్లాట్ ఫారమ్ లను కలిగి ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా నిత్యం వందలాది రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి. దేశంలోని అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటిగా కొనసాగుతోంది.

⦿సికింద్రాబాద్ జంక్షన్- తెలంగాణ

ఇది తెలంగాణలోని ఒక ప్రధాన రైల్వే స్టేషన్. దక్షిణ మధ్య రైల్వేలో అత్యంత కీలకమైనది. ఈ రైల్వే స్టేషన్ లో మొత్తం 10 ప్లాట్ ఫారమ్ లు ఉంటాయి. దక్షిణ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇక్కడి నుంచి రోజూ 230 కి పైగా రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి. నిత్యం 2 లక్షల మంది ప్రయాణిస్తుంటారు.

Read Also: గిన్నిస్ రికార్డుల్లోకి ఢిల్లీ రైల్వే స్టేషన్, కారణం ఏంటో తెలుసా?

Related News

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

SCR Special Trains: చర్లపల్లి నుండి కాకినాడకు స్పెషల్ ట్రైన్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

IRCTC Tour: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. ఒకే ట్రిప్‌లో సింగపూర్, మలేసియా చూసే ఛాన్స్!

Railway Station Closed: ఆ రైల్వే స్టేషన్ మూసివేత.. జనాలు లేక కాదు, ఉద్యోగులు లేక!

Hydrogen Train Ticket: నీటితో నడిచే రైలు వచ్చేస్తోంది, టికెట్ ధర ఎంతో తెలుసా?

Bullet train India: బుల్లెట్ ట్రైన్ టైమ్ వచ్చేసింది.. ఇక మిగిలింది అదొక్కటే.. సిద్ధం కండి!

Big Stories

×