Chat GPT: ఆర్టీఫిషయల్ ఇటెలిజెన్స్ వచ్చాక ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో ఎవరికీ అంతుచిక్కడం లేదు.. చూసినవన్నీ నిజాలే అనిపిస్తోంది.. కానీ అది తీరా చూస్తే అంతా ఫేక్ అని తేలిపోతుంది. ముఖ్యంగా యువతను, నెటిజన్లను ఏఐతో క్రియేట్ చేసిన ముప్పతిప్పలు పెడుతోంది. ఇంకా ఏ సమాచారం కావాలన్ని ఏఐ క్షణాల్లోనే ఇచ్చే్స్తోంది. అయితే ఏఐ నుంచి కొన్ని సలహాలు మాత్రమే తీసుకోవాలని.. ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరాదని ప్రముఖ నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ ఓ 60 ఏళ్ల వ్యక్తి చాట్ జీపీటీని వైద్య సలహా అడిగాడు. అది ఇచ్చిన సజేషన్ అతను మూడు వారాల పాటు ఆస్పత్రిలో బెడ్ పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం..
న్యూయార్క్ కు చెందిన వ్యక్తి తన తీసుకునే ఫుడ్ నుంచి ఉప్పు లేదా సోడియం క్లోరైడ్ ను ఎలా రిమూవ్ చేయాలో చాట్ జీపీటీని కోరాడు. దానికి చాట్ జీపీటీ ఏమని సలహా ఇచ్చింది తెలుసా..? మీరు తీసుకునే ఫుడ్ ను సోడియం బ్రోమైడ్ తో కలిపి తీసుకోవాలని సలహా ఇచ్చింది. దీంతో ఆ వ్యక్తి ఆన్ లైన్ లో సోడియం బ్రోమైడ్ కొనుగోలు చేశాడు. ఇక అతను ఫుడ్ తీసుకునే సమయంలో ఉప్పుుకు బదులుగా సోడియం బ్రోమైడ్ ను తీసుకోవడం మొదలు పెట్టాడు. అయితే ఈ సలహాపై అతని ఏ డాక్టర్ ను అడగలేదు. కొన్ని రోజులపాటు భోజనంలో సోడియం బ్రోమైడ్ కలపి ఆహారం తీసుకున్నాడు. దీంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. చివరకు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
ఆ 60 ఏళ్ల మనిషికి గతంలో ఎలాంటి రోగం కానీ ఇతర మానసిక సమస్యలు లాంటివి లేవు. కానీ అతను ఎప్పుడైతే సోడియం బ్రోమైడ్ ఆహారంలో కలుపుకుని తీసుకున్నాడో అప్పటి నుంచి శరీరంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అతని శరీరంపై మచ్చలు, భయం, భ్రమ, విపరీతమైన దాహం, మానసిక ఆందోళన లాంటి సమస్యలు పెరిగిపోయాయి. అతను వెంటనే ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. చాలా భయంతో వణికిపోయాడు. నీరు తాగడానికి కూడా అతను భయపడిపోయాడు. దీంతో ఆ వ్యక్తికి బ్రోమైడ్ విషప్రభావం ఉన్నట్టు చికిత్సలో తేలిపోయింది.
ఆస్పత్రిలో మూడు వారాల పాటు ఆ వ్యక్తికి డాక్టర్లు చికిత్స చేశఆరు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగుపడినట్టు వైద్యులు తెలిపారు. బాధిత వ్యక్తి శరీరంలో సోడియం, క్లోరైడ్ స్థాయిలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఆ వ్యక్తి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. దీంతో బాధిత వ్యక్తిని మరోసారి ఇలాంటి పిచ్చి పనుల చేయొద్దని వైద్యులు సూచించారు. వైద్యులను సంప్రదించకుండా AI సలహాను పాటించకూడదని నిపుణుల స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలపై సలహా తీసుకునే ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడొద్దని హెచ్చరిస్తున్నారు. వైద్యులను సంప్రదించిన తర్వాతనే ఆరోగ్య సమస్యలపై సలహాలు పాటించాలని చెబుతున్నారు.
ALSO READ: Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే