Upasana: ఉపాసన కొణిదెల(Upasana Konidela) పరిచయం అవసరం లేని పేరు చిరంజీవి (Chiranjeevi)కోడలిగా రామ్ చరణ్(Ramcharan) సతీమణిగా అందరికీ ఈమె సుపరిచితమే అలాగే బిజినెస్ ఉమెన్ గా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఉపాసన పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఎంతో మంచి మనసున్న అమ్మాయిగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకోవడమే కాకుండా మెగా ఇంటి పరువు ప్రతిష్టలను శిఖరాన నిలబెట్టింది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా తనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
కళ్ళతో చూసినప్పుడే నమ్మాలి..
ముఖ్యంగా తన అత్తయ్య మామయ్యల గురించి ప్రశ్నలు నిద్ర రావడంతో ఉపాసన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మీ అత్తయ్య గారు మీకు ఇచ్చిన ఒక మంచి సలహా ఏంటో చెప్పండి అనే ప్రశ్న ఎదురవడంతో తన అత్తయ్య తనకు ఒక విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పింది. ఏదైతే నువ్వు కళ్ళతో చూస్తావో దానినే నమ్ము అంతేకానీ ఇతరులు చెప్పిన విషయాలను ఎప్పుడు నమ్మొద్దు అంటూ తనకు ఒక సలహా ఇచ్చారని ఉపాసన తెలియజేశారు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఉపాసన రాంచరణ్ ప్రేమ వివాహం…
ఉపాసన రాంచరణ్ ఇద్దరిదీ ప్రేమ వివాహం అనే సంగతి మనకు తెలిసిందే. ఇద్దరి కులాలు వేరైనా ఈ ఇద్దరు ప్రేమలో పడటంతో కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేశారు. అయితే మొదటిసారి తన మామయ్య చిరంజీవి తనని చూసిన తరువాత ఈ అమ్మాయి ట్రెడిషనల్ అమ్మాయి కాదు అంటూ మాట్లాడారని ఈ సందర్భంగా ఉపాసన తెలియజేశారు. అయితే చిరంజీవి తనని చూడగానే ఇలా మాట్లాడారనే విషయాన్ని ఉపాసన తెలియచేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. అయితే ఉపాసన ట్రెండ్ కు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎంతో ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ ఎంతో చక్కగా సాంప్రదాయ పద్ధతులను అవలంబిస్తారని చెప్పాలి. ఇలా ఉపాసన తన ఇంటి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత తన గురించి చిరు అభిప్రాయం కూడా మారి ఉంటుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
మేడ్ ఫర్ ఈచ్ అదర్..
ఇక ఉపాసన మెగా ఇంటికి పర్ఫెక్ట్ కోడలు అంటూ కూడా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు ఉపాసన రాంచరణ్ పై ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ ప్రస్తుతం మాత్రం ఈ జంటను చూసిన ఎవరైనా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కామెంట్లు చేయాల్సిందే. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండటమే కాకుండా ఎందరికో ఆదర్శంగా నిలిచారని చెప్పాలి. ఇక వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్న ఈ దంపతులు వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక ఈ దంపతులకు క్లిన్ కారా(Klin Kara) అనే కుమార్తె జన్మించిన విషయం తెలిసిందే. అయితే మెగా లిటిల్ ప్రిన్సెస్ ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలను ఇప్పటివరకు రామ్ చరణ్ ఉపాసన తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడం గమనార్హం.
Also Read: Sravanthi Chokkarapu: తెల్లారితే పెళ్లి.. రాత్రికి రాత్రే ఆపని చేసిన స్రవంతి..బయటపడ్డ నిజాలు!