E-Paper
Advertisement

పిఠాపురం వర్మకు టీడీపీ షాక్.. ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తొలగింపు, అదే కారణమా?

పిఠాపురం వర్మకు టీడీపీ షాక్.. ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తొలగింపు, అదే కారణమా?
Advertisement

Amaravati: టీడీపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి వర్మను తప్పించింది. కొద్దిరోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీని వెనుక అసలేం జరిగింది?

పిఠాపురం వర్మకు టీడీపీ షాక్.. ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తొలగింపు

Advertisement

పిఠాపురం నియోజకవర్గం పేరు చెబితేచాలు.. ముందుగా మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మ పేరు అందరికీ గుర్తుకు వస్తుంది. సింపుల్ పిఠాపురం వర్మగా పేరుపొందారు. గడిచిన రెండేళ్లుగా ఆ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను టీడీపీ గమనిస్తోంది. ఈ విషయంలో చూసినా వర్మ పేరు బయటకు వస్తోంది. దీంతో కూటమి మధ్య విభేదాలు మొదలయ్యాయంటూ ప్రచారం జరుగుతోంది.

దీన్ని గమనించిన టీడీపీ హైకమాండ్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. పిఠాపురం నియోజకవర్గం బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మ తప్పించింది. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనుంది. వీలైనంత త్వరగా కమిటీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలు పెట్టేసింది.

Advertisement

ప్రోటోకాల్ వ్యవహారంపై పార్టీలో రచ్చ.. పోలిట్ బ్యూరో కమిటీలో సీఎం ప్రస్తావన

కొద్దిరోజుల కిందట పిఠాపురం నియోజకవర్గంలో ప్రోటోకాల్ వ్యవహారంలో వర్మ తీరుపై టీడీపీ హైకమాండ్ కాసింత ఆగ్రహంగా ఉంది. ఆయన తీరుపై సీఎం చంద్రబాబు రుసరుసలాడారు. జరుగుతున్న పరిణామాలతో వర్మ కోరితే ఆ బాధ్యతల నుంచి ఆయన్ని టీడీపీ తప్పించిందా? పార్టీనే వర్మను పక్కన పెట్టిందా? అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సివుంది.

ఇటీవల టీడీపీ పోలిట్ బ్యూరో కమిటీల ప్రమాణ స్వీకారానికి వర్మ కూడా హాజరయ్యారు. ఆ సమయంలో సీఎం చంద్రబాబు ఆయన అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. సమావేశం తర్వాత వర్మ తన కొడుకుతో కలిసి లోకేష్‌ను కలిసినట్లు ప్రచారం ఉంది. అప్పుడే వర్మను పిఠాపురం ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి, కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు.

ALSO READ: వరుణుడి ‘కూల్’ అప్డేట్.. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు.. ఎన్ని రోజులంటే?

 

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×