BigTV English

TDP Social media guidelines : రాజకీయ వ్యూహాలతో టీడీపీ అలర్ట్.. సోషల్ మీడియా వారియర్స్ కు గైడ్ లైన్స్..

TDP Social media guidelines : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల వ్యూహాలతో టీడీపీ అలర్ట్‌ అయ్యింది. సోషల్ మీడియా వారియర్స్‌కు కొన్ని గైడ్‌లైన్స్‌ కూడా జారీచేసింది. అయితే, వీటి వెనుక కారణం ఏంటీ…? జనసేన-టీడీపీ మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర జరుగుతోందా..? సోషల్‌మీడియాలో అనవసరమైన కామెంట్లు వద్దంటూ టీడీపీ ఇచ్చిన ఆర్డర్‌ అందుకేనా…? ఇంతకీ ప్రత్యర్థుల వ్యూహం ఏంటీ…?

TDP Social media guidelines : రాజకీయ వ్యూహాలతో టీడీపీ అలర్ట్.. సోషల్ మీడియా వారియర్స్ కు గైడ్ లైన్స్..

TDP Social media guidelines : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల వ్యూహాలతో టీడీపీ అలర్ట్‌ అయ్యింది. సోషల్ మీడియా వారియర్స్‌కు కొన్ని గైడ్‌లైన్స్‌ కూడా జారీచేసింది. అయితే, వీటి వెనుక కారణం ఏంటీ…? జనసేన-టీడీపీ మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర జరుగుతోందా..? సోషల్‌మీడియాలో అనవసరమైన కామెంట్లు వద్దంటూ టీడీపీ ఇచ్చిన ఆర్డర్‌ అందుకేనా…? ఇంతకీ ప్రత్యర్థుల వ్యూహం ఏంటీ…?


రాష్ట్రంలో ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉండటంతో తెలుగుదేశం పార్టీ తమ సోషల్ మీడియా యోధులకు సూచనలు జారీ చేసింది. పార్టీకి మద్దతుగా పని చేద్దాం అనుకునే వారికి తెలుగుదేశం పార్టీ కొన్ని గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది. సోషల్ మీడియాను తమ భుజాలపై మోస్తున్న తెలుగు తమ్ముళ్లకు కొన్ని విజ్ఞప్తులు వెలువరించింది. సోషల్ మీడియా ద్వారా పార్టీకి ఉపయోగపడే విధంగా పోస్టులు పెట్టడానికి అవసరమైన సూచనలు ఇందులో పొందుపరచింది. అయితే, వీటి వెనుక ఉన్న నేపథ్యాన్ని కూడా సూచనల్లో సూత్రప్రాయంగా వెల్లడించినట్లు తెలుస్తుంది. ఎన్నికల వ్యూహాల్లో భాగంగా అధికార వైసీపీ కుట్రలు భగ్నం చేయడానికే ఈ సూచనలు చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. రాబోయే ఎలక్షన్లో టీడీపీ, జనసేన పొత్తుతో అధికార వైసీపీకి నష్టం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి, జనసేన, టీడీపీ శ్రేణుల మధ్య సఖ్యతను చెడగొట్టడానికి వైసీపీ ప్రయత్నిస్తుందనీ… ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టే విధంగా సోషల్ మీడియా కార్యకర్తలు పనిచేయడానికి టీడీపీ ఈ సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

టీడీపీ సోషల్ మీడియా ఆర్డర్‌ను పరిశీలిస్తే… మొదటిగా, తెలుగుదేశం పార్టీ చేసిన మంచి పనులు, అభివృద్ధి, సంక్షేమం, పార్టీ నాయకత్వం దూరదృష్టి, వారి విజయాల వంటివి సోషల్ మీడియా వేదికలపై ప్రచురించాలని వెల్లడించినట్లు తెలుస్తుంది. అలాగే, వైసీపీ నాయకుల వల్ల ప్రజలకు కలుగుతున్న కష్టాలు, ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు, వైసీపీ విధాన నిర్ణయాల్లో తప్పులు, అధికార పార్టీ అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని ఇందులో పేర్కొన్నారు. ముఖ్యంగా, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో పాటు సినిమా నటీనటుల పైన ఎలాంటి కామెంట్లూ చేయకూడదని కార్యకర్తలకు సూచించారు. అలాగే, మరిముఖ్యంగా… జనసేన పార్టీపైన ఏ విధంగానూ వ్యతిరేకత చూపే పోస్టులు పెట్టకూడదని వెల్లడించారు. ఒకవేళ, ఎవరైనా ఎమోషన్‌లో వ్యతిరేక పోస్టులు పెట్టినా వాటిని వెంటనే డిలీట్ చేయాలనీ… దీని వల్ల పార్టీకి ప్రయోజనం లేకపోగా నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ఇలాంటి పోస్ట్‌ల వల్ల పార్టీ ప్రజల్లోకి తీసుకు వెళ్దాం అని భావించిన విషయాల కంటే ఎక్కువగా వీటిపై ఫోకస్ పడుతుందని అన్నారు.


మరీ ముఖ్యంగా పార్టీలో, పార్టీ అనుబంధ విభాగాల్లో వివిధ పదవుల్లో, హోదాల్లో ఉన్నవారు తమ బాధ్యతను మరచి, పూర్తి బాధ్యతా రాహిత్యంతో వివాదాస్పద పోస్టులు పెట్టకుండా లేదా వివాదాల్లో దూరకుండా.. పార్టీ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని, తమకు అప్పగించిన బాధ్యతను శ్రద్ధతో నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. టీడీపీ – జనసేన పొత్తు, అభ్యర్థుల ఎన్నిక, తదితర అంశాలను పూర్తిగా పార్టీ అధినాయకత్వానికి వదిలేసి, తమ బాధ్యతను, పరిధిని సోషల్ మీడియా వరకే పెట్టుకొని… ఆ పరిధిలోనే వైసీపీని ఎప్పటికప్పుడు ఎలా ఓడిస్తూ ముందుకు పోవాలి అనే దానిపై శ్రద్ధ పెట్టాల్సిందిగా మనవి చేశారు. ఇంకా ఎవరైనా, పార్టీ గీసిన హద్దులు దాటి అటువంటి పోస్టులు పెడుతూ ఉన్నట్లయితే, అటువంటి వారిని నివారించమని… వీలైతే అలాంటి పోస్ట్ లను వారిచేత డిలీట్ చేయించాలనీ… లేదా అటువంటి వారి పోస్టులకు స్పందించకుండా వదిలేయాలని సూచించారు. జనసేన ముసుగులో లేదా ఏదైనా కులం ముసుగులో ఐప్యాక్ పేటీఎం అకౌంట్స్ నుంచి వచ్చి రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టినా, మాట్లాడినా అటువంటి వారికి బదులు ఇవ్వకుండా, స్పందించకుండా వదిలేస్తే… వారే ప్రయత్నించి, ప్రయత్నించి ఆఖరుకు వారి కోరిక నెరవేరక ఆగిపోతారని సోషల్ మీడియా ఆర్డర్‌లో వెల్లడించారు.

తరచూ పార్టీకి, నాయకుడికి మద్దతుగా పోస్టులు పెడుతూ.. ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్స్ ఉండి సోషల్ మీడియాలో ప్రభావశీలురు అయిన వ్యక్తులు వివాదాస్పద పోస్టులకు ఈ మూడు నెలలు దూరంగా ఉండగలరని టీడీపీ పోస్ట్ పేర్కొంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అల్టిమేట్ గోల్ 2024 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించడమేనని వెల్లడించారు. గెలుస్తున్నాం అన్న ధైర్యంతో చేయాల్సిన ప్రయత్నాన్ని, శ్రమను తగ్గించకుండా… ఈ మూడు నెలలు వివాదాల జోలికి పోకుండా… ఇంకా ఎక్కువ కష్టపడి పార్టీ విజయంలో తమ వంతు కృషి చేయాలనీ… సమయాన్ని సద్వినియోగపరచి పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో తమ వంతు పాత్రను సక్రమంగా పోషించాలని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు సూచించారు.

అయితే, రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఎలాగైనా చిత్తు చేయాలనే సంకల్పంతో ఉన్న టీడీపీ వర్గాలు అన్ని వైపుల నుండి అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉంటుంది కనుక ఆ వేదికలను టీడీపీ పార్టీ ప్రత్యేక ఆయుధంగా వినియోగించుకోవాలని అనుకుంటుంది. పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో వచ్చిన సానుభూతిని ఏ మాత్రం తగ్గించకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటున్నట్లు సమాచారం. అందులో భాగంగానే, సోషల్ మీడియా వేదికలపై ఎవ్వర్నీ నోరు జారవద్దంటూ హెచ్చరించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ అభిమానులు ఫేక్ ఖాతాలు తెరిచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పటికీ స్పందించవద్దని సూచించారు. ఏది ఏమైనప్పటికీ, గెలుపు కోసం టీడీపీ వేస్తున్న వ్యూహాల్లో ఇది కూడా అత్యంత ముఖ్యమైన స్టెప్‌గా పరిగణిస్తున్నారు. ఇక, ఈ సూచనలను అటు టీడీపీ, ఇటు జనసేన కార్యకర్తలు ఎంతగా పాటిస్తారో వేచి చూడాలి.

Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×