E-Paper
Advertisement

CM Revanth Reddy : వాస్తవాలను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉండాలి.. అధికారులకు సీఎం దిశానిర్దేశం..

CM Revanth Reddy : 2024-25 వార్షిక బడ్జెట్‌ వాస్తవికతను ప్రతిబింబించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్థిక శాఖపై సచివాలయంలో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, లక్ష్యాలపై ప్రజలకు వాస్తవాలు చెబుదామన్నారు.

తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్‌ తయారు చేయాలన్నారు. ప్రజా శ్రేయస్సే అంతిమ లక్ష్యంగా బడ్జెట్‌పై కసరత్తు జరగాలని సీఎం అధికారులకు సూచించారు. హామీల అమలుకు వ్యయ అంచనాలు పక్కాగా ఉండాలన్నారు. ప్రజలకు అర్థమయ్యేలా బడ్జెట్‌ రూపకల్పన జరగాలని సీఎం సూచించారు.

Advertisement

ఎలాంటి దాపరికం లేకుండా ఆదాయ వ్యయాల ముఖచిత్రం స్ఫష్టంగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్రానికి పేరు వస్తుందనే భేషజాలకు పోవద్దన్నారు. కొత్త వాహనాలు కొనుగోలు చేయకుండా ఉన్న వాటినే సక్రమంగా వాడుకోవాలని అధికారులను సీఎం అధికారులకు సూచించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎస్‌ శాంతికుమారి, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×