Nara Lokesh: ఇక్కడ అంత సీన్ లేదు. మీరెందుకు ఎగిరి ఎగిరి పడుతున్నారు. సైలెంట్ గా ఉండండి. లేకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. సక్రమంగా పాలన సాగుతున్న ఈ గోల ఏంది? ఈ బాధ ఏంది? మీవల్ల జరిగే నష్టం మీకైనా అర్థమవుతోందా.. చల్లగా కూర్చోండి. ప్రజల్లోకి వెళ్ళండి. ప్రజా సమస్యలు తెలుసుకోండి. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించండి. మరోమారు అలా అంటూ, ఇలా అంటూ స్వరం వినిపించిందా ఊరుకొనే ప్రసక్తే లేదంది ఆ పార్టీ అధిష్టానం. ఏంటబ్బా ఇంత కథ ఏ పార్టీలో జరుగుతుందని అనుకుంటున్నారా.. అదేనండీ టీడీపీలో..
ఏపీలో ఇటీవల మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ ను టీడీపీ క్యాడర్ వినిపిస్తోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. కూటమి విజయంలో కీలక పాత్ర వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి వరించింది. పవన్ కూడ ఆ పదవికి తగినట్లుగానే నిరంతరం ప్రజల్లో ఉంటూ, తన హవా సాగిస్తున్నారు. సీఎం చంద్రబాబు కూడ ఎక్కడ కూడా పవన్ కు మర్యాదల్లో లోటు లేకుండా చూస్తున్నారు.
అయితే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడ ఎన్నికలకు ముందు యువగళం పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర నిర్వహించారు. ఎన్నికల తర్వాత లోకేష్ కు మంత్రి పదవి దక్కింది. అంతా సవ్యంగా సాగుతున్న వేళ ఒక్కసారిగా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ ను టీడీపీలోని కొందరు నేతలు వినిపిస్తున్నారు.
అంతటితో ఆగక సోషల్ మీడియాలో కూడ విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. ఇదే ఇప్పుడు కొందరు జనసేన కార్యకర్తలకు రుచించడం లేదట. సీఎం కావాల్సిన తమ నాయకుడు పవన్, డిప్యూటీ తో సరిపెట్టుకున్నారని అందుకు సమానంగా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి అంటూ టీడీపీ లోని కొందరు కావాలని ప్రచారం చేస్తున్నట్లు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు.
ఇలా ఈ రెండు పార్టీల నాయకుల మధ్య కోల్డ్ వార్.. హీట్ వార్ కు దారితీస్తున్న క్రమంలో టీడీపీ అధినాయకత్వం చకదిద్దే చర్యలకు పూనుకుంది. నారా లోకేశ్ డిప్యూటీ సీఎం కామెంట్లపై హైకమాండ్ సీరియస్ కాగా, టీడీపీ అధికార ప్రతినిధులకు హైకమాండ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి మాటలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని గట్టిగా ఆదేశాలిచ్చింది.
Also Read: Deputy CM post: డేంజర్‌లో బాబు, పవన్‌ల స్నేహం.. కాస్త వాళ్లకు ఎవరైనా చెప్పండయ్యా!
ఇటీవల ముగ్గురు, నలుగురు మాట్లాడిన మాటలపై సీఎం చంద్రబాబు కూడ ఆగ్రహం వ్యక్తం చేశారట. లోకేశ్‌ని డిప్యూటీ సీఎం చేయాలనే నిర్ణయమేదీ లేదని టీడీపీ క్లారిటీ ఇచ్చిందట. ఎవరైనా ఇకపై ఈ అంశం గురించి మాట్లాడవద్దని, మాట్లాడితే చర్యలు ఉంటాయని హైకమాండ్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య సాగుతున్న కోల్డ్ వార్ కు ముగింపు పడుతుందో లేదో వేచిచూడాలి.
నారా లోకేశ్ డిప్యూటీ సీఎం కామెంట్లపై హైకమాండ్ సీరియస్
టీడీపీ అధికార ప్రతినిధులకు హైకమాండ్ హెచ్చరికలు
ఇలాంటి మాటలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని గట్టి ఆదేశాలు
ఇటీవల ముగ్గురు, నలుగురు మాట్లాడిన మాటలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
లోకేశ్‌ని డిప్యూటీ సీఎం చేయాలనే నిర్ణయమేదీ… pic.twitter.com/4UteTPlRMm
— BIG TV Breaking News (@bigtvtelugu) January 20, 2025