Deputy CM post: ఏపీ రాజకీయ ముఖచిత్రంలో వారి స్నేహం అనిర్వచనీయం. ఎక్కడ కలిసినా, ఆ పలకరింపులు వేరు. ఆ ఆప్యాయతలు వేరు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆ ఇద్దరు నేతలు పలకరించుకున్న తీరుకు కార్యకర్తలు ఎంత ఆనందపడ్డారో వర్ణించలేము. అటువంటి వారి స్నేహానికి ఇప్పుడు చిక్కులు వస్తున్నాయా.. పాపం పోనీలే అనుకుంటే చివరికి వారిద్దరికీ ఎసరు పెట్టేలా ఉన్నారట ఆ రెండు పార్టీల నాయకులు. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు ఆయా పార్టీల ప్రధాన నాయకులు. ఇంతకీ ఆ ఇద్దరు నాయకులు ఎవరో కాదు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ఏపీలో కూటమి అధికారంలోకి రావడం ఏమో కానీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడడమే రాజకీయ సంచలనం. సీఎం చంద్రబాబును వైసీపీ ప్రభుత్వ హయాంలో అరెస్ట్ చేసిన సమయంలో పవన్ కళ్యాణ్ వేసిన ఒక్కొక్క అడుగు వారిద్దరి మైత్రికి బలం చేకూర్చింది. చంద్రబాబును ములాఖత్ ద్వార కలిసిన అనంతరం పవన్ జైలు బయట తాము కలిసి ఎన్నికలకు వస్తునట్లు ప్రకటించి రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. కూటమి విజయానికి తొలి అడుగు పడింది కూడ అప్పుడే. అలా కూటమిగా మూడు పార్టీలు కలిసి రావడంతో, తిరుగులేని విజయం వారికి వరించిందని చెప్పవచ్చు.
అధికారం చేపట్టారు. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ భాద్యతలు చేపట్టారు. పలుమార్లు పవన్ మాట్లాడుతూ.. సుధీర్ఘ రాజకీయ చరిత్ర గల చంద్రబాబును జైలులో చూసి బాధపడినట్లు, ఆ దృశ్యాలు తన మనస్సును కలచివేశాయన్నారు. అలాగే చంద్రబాబు కూడ ఏమాత్రం పవన్ కు లోటు లేకుండ చూసుకుంటూ వస్తున్నారు. ఇలా వీరి మైత్రి బంధం చూసి, వారెవ్వా.. క్యా సీన్ హై అంటూ సోషల్ మీడియా కోడై కూసింది.
Also Read: United Breweries Group: బీరు ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ బీర్లు వచ్చేస్తున్నాయ్..
అటువంటి వీరి స్నేహానికి ఇటీవల డేంజర్ బెల్స్ మ్రోగుతున్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ వరకు ఓకేగానీ, కొంతమంది టీడీపీ నాయకులు ఏకంగా పవన్ పేరెత్తి మరీ ఆ స్థాయి లోకేష్ కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనితో కొంతమంది జనసేన క్యాడర్ కూడ టీడీపీ క్యాడర్ కి స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు. ఇలా ఈ వివాదం సోషల్ మీడియా నుండి ప్రత్యక్ష రాజకీయాలకు కూడ పాకే పరిస్థితి వచ్చింది. ఇటువంటి సంధర్భంలో చంద్రబాబు, పవన్ జోక్యం చేసుకోకుంటే వారి మైత్రికి చిక్కులు వచ్చినట్లే అంటూ ప్రచారం ఊపందుకుంది, మరి ఇప్పటికైనా ఎవరి పార్టీ క్యాడర్ ను వారు మందలించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు కోరుతున్నారు.