BRS vs Bjp: పండగ పూట పసుపు బోర్డు రాష్ట్రానికి వచ్చిన ఆనందం కూడా కరవవుతోందా? అంటే అవుననే తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలెన్నో ఈ బోర్డుకోసం యత్నించినా.. రాష్ట్రానికే ఆ అవకాశం దక్కడం.. ఆపై నిజామాబాద్ జిల్లా నేతకు బోర్డు బాధ్యతలివ్వడం.. వంటి అంశాలు తెరమరుగై మా వల్లంటే మావల్లేనంటూ.. కాంగ్రెస్- బీజేపీ- బీఆర్ఎస్ తన్నులాట.. ఏం చెబుతోంది?
సంక్రాంతి కానుకగా.. తెలంగాణకు మోడీ సర్కార్ ఇచ్చిన కానుకగా.. పసుపు బోర్డు అంటూ బీజేపీ చేసిన ప్రచారపు ఆనందం కాసేపైనా నిలవలేదు. తాము లేఖ రాయడం వల్లే ఇదంతా జరిగినట్టుగా కాంగ్రెస్ మంత్రి తుమ్మల కామెంట్ చేయడంతో కాక చెలరేగింది. మంత్రి తుమ్మల కామెంట్‌పై ఎంపీ అరవింద్ బదులిస్తూ.. ఎడ్లబండి వెళ్తున్నప్పుడు తుమ్మల అనే ఈగ వాలి తానే చక్రాలను తిప్పుతున్నట్లు భావిస్తుందని ఎద్దేవా చేశారు. దీంతో తుమ్మల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సైతం ఇదే అంశంపై స్పందించడంతో.. వ్యవహారం మరో మలుపు తీసుకుంది.
కవితతో పాటు కేటీఆర్ సైతం సరిగ్గా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేయడంతో.. రఘునందన్ మరో కోణంలో ఈ అంశంపై స్పందించారు. ఏకంగా కవిత ఆరోగ్యంపై అనుచిత వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్ అయ్యారు. పసుపుబోర్డును తాము స్వాగతిస్తున్నామనీ. అయితే ప్రారంభంపైనే తమకు తీవ్ర అభ్యంతరాలున్నాయన్నది కవిత వాదన. ఇదొక పార్టీ కార్యక్రమంలా నడిచిందని.
తాము స్థానిక ప్రజా ప్రతినిథులమనీ.. మాకు ఆహ్వానాలు అందలేదనీ.. 2014 నుంచి 18 వరకూ పసుపుబోర్డు కోసం తాను పార్లమెంటు వేదికగా పోరాటం చేశాననీ.. పాలిటిక్స్ కోసం పసుపు బోర్డు ఏర్పాటు కాక పోతే దిగుమతులు ఆపాలి. రూ. 15 వేల మద్దతు ధర పసుపు రైతులకు ఇవ్వాలి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెల్పూరులో ఉన్న 40 ఎకరాల స్పైసెస్ బోర్డు స్థలంలో పసుపు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అన్నారు ఎమ్మెల్సీ కవిత.
Also Read: నైని బొగ్గు బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తిపై.. క్లారిటీ ఇచ్చిన భట్టి
జక్రాన్ పల్లి దగ్గర ఎంపీ ధర్మపురి అరవింద్ ఎయిర్ పోర్టు తీసుకురావాలనీ, కంబోడియా మలేసియా లాంటి దేశాల నుంచి తక్కువ క్వాలిటీ పసుపు దిగుమతులు జరుగుతున్నాయనీ, ఇదే అంశంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను తాను రెండు సార్లు కలిశాననీ, బోర్డుతో పాటు మద్దతు ధర ఉంటే రైతులకు న్యాయం జరిగిందని గతం నుంచీ తాము ఇదే డిమాండ్ చేశామనీ అంటారు ఎమ్మెల్సీ కవిత.
పసుపు బోర్డు వచ్చిన ఆనందంకన్నా.. ఈ నేతల పోరే తమను తీవ్రంగా బాధిస్తోందని వాపోతున్నారు పసుపు రైతులు. ఎవరు చేసినా రాష్ట్రాభివృద్ధికే చేయాలి కానీ.. ఈ పేరు కోసం పోరాటాలేంటి? ఆ సమయంలో అధికారంలో ఉన్నవారు.. తమ తమ రాజకీయ అవసరాల కోసం ఆయా.. పనులు చేయడం కూడా ఒక గొప్పేనా? అంటున్నారు.ఈ మాటలను విన్న సామాన్యులు.