Kurnool Crime: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున నేషనల్ హైవే-44 పై బైక్‌ని ఢీ కొట్టింది ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. స్పాట్‌లో 20 మంది ప్రయాణికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. దాదాపు డజను వరకు ప్రయాణికులు బయటపడినట్టు సమాచారం.
కర్నూలులో ఘోర ప్రమాదం.. మంటల్లో ట్రావెల్ బస్సు
కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున వేమూరి కావేరి ట్రావెల్స్ చెందిన వోల్వో బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కల్లూరు మండలం ఉలిందకొండ సమీపంలోకి రాగానే వెనక నుంచి వచ్చిన ఓ బైక్.. బస్సు ఢీ కొట్టింది. దీంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు వ్యాపించాయి. బస్సు కింద బైక్ ఉండిపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు అంతా అంటుకున్నాయి. ఘటన తెల్లవారుజామున జరగడంతో ప్రయాణికులు అంతా గాఢ నిద్రలో ఉన్నారు. బైక్ పైనున్న స్పాట్‌లో వ్యక్తి మరణించాడు.
ఆ మంటల నుంచి ప్రయాణికులు తేరుకొనే లోపు కొందరు ఈ లోకాన్ని వదిలిపోయారు. హాహాకారాలు చేస్తూ దాదాపు డజను వరకు ప్రయాణికులు బయటపడ్డారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నేషనల్ హైవే నెంబర్ -44 కావడంతో ఆ రోడ్డు మీదుగా వెళ్తున్న వాహనాలు ఆపి.. బస్సులోని ప్రయాణికులను కాపాడే ప్రయత్నాలు చేశారు. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడడంతో దగ్గరకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
చివరకు పోలీసులు-స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు . గాయపడిన వారిని స్థానిక కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మంటల్లో బస్సు అంతా కాలిపోయింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ సిటీకి చెందినవారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సివుంది.
ALSO READ: పటాసులు కొనలేనంత పేదరికం.. ఇంట్లోనే తయారీ
ప్రమాదం సమయంలో బస్సులో దాదాపు 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వోల్వో బస్సు హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తోంది. ఘటన జరిగిన తర్వాత బస్సు నుంచి దూకి డ్రైవర్ పరారైనట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ప్రమాదం కర్నూలు పట్టణానికి పాతిక కిలోమీటర్ల దూరంలో జరిగినట్టు తెలుస్తోంది.
సరిగ్గా పుష్కర కాలం కిందట
సరిగ్గా పుష్కర కాలం కిందట ఇలాంటి ఘటన ఒకటి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగింది. 2103 ఏడాదిలో ప్రైవేటు ట్రావెల్స్‌కి చెందిన ఓ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా ప్రాణనష్టం జరిగింది. ఈ ఘటనలో 45 మంది ప్రయాణికులు మరణించారు. అప్పుడు ట్రావెల్ బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ఘటన జరిగింది. కారును ఓవర్ టేక్ చేయబోయిన డ్రైవర్, రోడ్డు పక్కనే ఉన్న ఐరన్ కంచెని ఢీ కొట్టింది బస్సు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన నుంచి డ్రైవర్-క్లీనరుతోపాటు ఐదుగురు ప్రయాణీయలు బయటపడ్డారు. 45 మంది ఈ లోకాన్ని విడిచిపెట్టారు.
బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులకు ఆదేశం https://t.co/mohou6wJ5X pic.twitter.com/DHI8Qsz1XR
— BIG TV Breaking News (@bigtvtelugu) October 24, 2025