E-Paper
Advertisement

తాడిపత్రిలో కవ్వింపు చర్యలు.. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడులు, భారీగా బలగాలు మోహరింపు

తాడిపత్రిలో కవ్వింపు చర్యలు..  టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడులు, భారీగా బలగాలు మోహరింపు
Advertisement

Tadipatri Fighting: పంచాయతీ ఎన్నికల వేళ ఏపీలో అక్కడక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పరిస్థితులు అదుపు తప్పాయి. టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నాయి. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకోవడంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అసలేం జరిగింది?

టెన్షన్‌లో తాడిపత్రి పట్టణం

అనంతపురం జిల్లా తాడిపత్రి గురించి చెప్పనక్కర్లేదు. అక్కడ ఎన్నికలతో పని లేదు. నిత్యం జేసీ బ్రదర్స్ – పెద్దారెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.  శుక్రవారం జేసీ ప్రభాకర్ రెడ్డి- మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో దాదాపు 10 మందికి పైగానే గాయపడ్డారు. తొలుత మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి నివాసంపై నుంచి కావాలనే టీడీపీ శ్రేణులను వైసీపీ వర్గం రెచ్చగొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.

టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడులు

Advertisement

పరిస్థితి గమనించిన టీడీపీ వర్గీయులు సమీపంలోని జూనియర్ కాలేజీ వద్దకు చేరుకున్నారు. అటు వైసీపీ వర్గాల వాళ్లు అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరగడంతో చివరకు ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకోవడం మొదలైంది. పెద్దారెడ్డి అనుచరుల దాడిలో జేసీ అనుచరులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆంజనేయ మాన్యానికి చెందిన రామ్మోహన్ పరిస్థితి విషమించడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రెడ్డిపోయిన జేసీ వర్గీయులు..  పెద్దారెడ్డి ఇంటి వద్ద ఉన్న నాలుగు కార్లు, 20 బైకులకు నిప్పుపెట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి. ఈ విషయం తెలియగానే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు సిబ్బంది. తాడిపత్రి ఘటన నేపథ్యంలో హుటాహుటిన తాడిపత్రి పట్టణానికి చేరుకున్న జిల్లా ఎస్పీ జగదీష్.

Advertisement

ALSO READ: జెడ్పీ పదవుల పంపకాలు చిచ్చు.. రాజీనామా చేసే ఆలోచన‌లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి?

పట్టణంలోని పరిస్థితులను స్వయంగా సమీక్షించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులకు సూచనలు చేశారు.  ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు.  తాడిపత్రి పట్టణంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేదన్నారు.

 

Related News

జెడ్పీ పదవుల పంపకాలు చిచ్చు.. రాజీనామా చేసే ఆలోచన‌లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి?

అక్వాన్ తుఫాన్ తీరం దాటిందో‌చ్.. ఏపీకి పెద్ద గండం తప్పింది, కుమ్మేస్తున్న భారీ వర్షాలు

‘బిగ్‌ టీవీ’ ముందే చెప్పింది.. జెడ్పీ పీఠాలపై లిస్టు ఇదిగో, ఎవరు ఎక్కడెక్కడంటే..

అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. రేపు విద్యా సంస్థలకు సెలవు!

బీటెక్ రవి ధర్నాపై.. ఎంపీ అవినాష్ రెడ్డి సెటైర్లు!

ఏపీ ప్రభుత్వానికి కృష్ణా ట్రిబ్యునల్ బిగ్ షాక్.. ఆ ప్రాజెక్టు గేట్లు మూసివేత?

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు.. నోటిఫికేషన్ విడుదల!

Big Stories

Advertisement
×