E-Paper
Advertisement

నా యాక్సిడెంట్‌పై తప్పుడు ప్రచారం చేస్తే బట్టలు విప్పి నిలబెడతా.. కేటీఆర్‌పై బల్మూరి ఫైర్!

నా యాక్సిడెంట్‌పై తప్పుడు ప్రచారం చేస్తే బట్టలు విప్పి నిలబెడతా.. కేటీఆర్‌పై బల్మూరి ఫైర్!
Advertisement

Balmoori Venkat: అసెంబ్లీ మీడియా హాల్ వేదికగా ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ బీఆర్ఎస్ ముఖ్య నేతలు హరీష్ రావు, కేటీఆర్ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభ, ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అంతర్గత కుమ్ములాటల నుంచి మొదలుకొని, జాతీయ స్థాయి వ్యాపారవేత్తలతో రహస్య భేటీల వరకు పలు అంశాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష నేతలకు ఘాటు సవాళ్లు విసిరారు.

హరీష్ రావు బీజేపీలోకి వెళ్లడం పక్కా

Advertisement

సిద్దిపేటలో సీఎం సభ పెట్టడంపై కేటీఆర్ వర్గం లోలోపల సంతోషంగా ఉందని.. హరీష్ రావును తిడుతుంటే కేటీఆర్ ఆనందిస్తున్నారని బల్మూరి వెంకట్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నేతలతో మాట్లాడలేదని ప్రమాణం చేయాలని సవాల్ విసిరితే హరీష్ రావు ఇప్పటికీ స్పందించలేదన్నారు. దీనిని బట్టి ఆయన బీజేపీతో టచ్‌లో ఉన్నారని ఒప్పుకున్నట్టేనని విమర్శించారు. రాబోయే రోజుల్లో హరీష్ రావు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. సిద్దిపేట అభివృద్ధికి సీఎం రూ.540 కోట్లు కేటాయిస్తే కృతజ్ఞత చెప్పాల్సింది పోయి ఇష్టానుసారంగా మాట్లాడటం తగదన్నారు. ఆంధ్రా కాలేజీలకు పాలు అమ్మిన మాట వాస్తవం కాదా అని నిలదీసిన ఆయన, రెండోసారి ఇరిగేషన్ మంత్రిగా ఎందుకు కొనసాగించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అదానీ భేటీపై సవాల్

Advertisement

కేటీఆర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బల్మూరి వెంకట్, ఆయనను ఉద్దేశించి ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. తనకు రోడ్డు ప్రమాదం జరిగితే.. కేటీఆర్‌పై విమర్శలు చేసినందుకే అలా జరిగిందని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. చెన్నైలో అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీని కలవడానికి కేటీఆర్ ప్రయత్నించిన మాట నిజమా కాదా అని ప్రశ్నించారు. అదానీ కలవడానికి నిరాకరిస్తే.. జగన్ వెంట వెళ్లి ఆయన కాళ్లు మొక్కింది వాస్తవం కాదా అని నిలదీస్తూ.. దమ్ముంటే పిల్లల మీద ఒట్టేసి నిజం చెప్పాలని సవాల్ విసిరారు.

నిజస్వరూపం బయటపెడతా.. బల్మూరి వార్నింగ్

మొన్నటి వరకు రాజకీయ విమర్శలను ఒక పరిమితికి లోబడి మాత్రమే చేశానని, కానీ తన ప్రమాదంపై సోషల్ మీడియాలో చేసిన నీచపు ప్రచారం చూశాక మరో అడుగు ముందుకు వేయాలని నిర్ణయించుకున్నానని బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. కేటీఆర్ అసలు రంగు, నిజస్వరూపం త్వరలోనే ప్రజల ముందు బట్టబయలు చేస్తానని హెచ్చరించారు. పూర్తి ఆధారాలతో సమాజం ముందు నిలబెడతానని ఆయన తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు.

Also Read: ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో ఈ పనులు అస్సలు చేయెద్దు! చిన్న పొరపాట్లతో జాబ్ పోతుంది

Tags

Related News

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర కత్తితో ఓ వ్యక్తి హల్‌చల్.. జూబ్లీహిల్స్‌లో ఘటన, ఎవరా వ్యక్తి?

షాకింగ్ న్యూస్.. మండీ బిర్యానీ తిని 9మంది ఆస్పత్రిపాలు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ వ్యాఖ్యలపై టీపీసీసీ ఫైర్.. త్వరలో నివేదిక!

ఏసీబీ వలలో చిక్కిన టోలీ చౌక్ సీఐ.. ఎలా పట్టుకున్నారంటే?

డిసెంబర్ 1 నుంచి వారికి బాధ్యతలు.. మంత్రి సీతక్క ఆదేశాలు జారీ!

దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బావోద్వేగం!

చంద్రబాబుకు దాసోహం.. నీటి హక్కులు తాకట్టు.. కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్!

Big Stories

Advertisement
×