BSNL Postpaid Plan: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్.. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత చౌకైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ టెలికాం సంస్థలు ఇలాంటి ప్లాన్లను ఎక్కువ ధరలకు అందిస్తుండగా.. BSNL మాత్రం కేవలం రూ. 199 నెలవారీ ఛార్జీతో దీనిని తీసుకురావడం విశేషం. గతంలో జియో కూడా ఇదే ధరకు ఇలాంటి ప్లాన్‌ను తీసుకొచ్చినప్పటికీ.. ఒక్కో యూజర్ పై వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవడానికి ధరలను సవరించడం గమనార్హం. ఇంతకీ ఈ బీఎస్ఎన్ఎల్ చీపెస్ట్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ ప్లాన్ కింద యూజర్లకు నెలవారీగా 25GB డేటా లభించనుంది. ఒకవేళ ఇందులో డేటా మిగిలినట్లైతే దానిని వచ్చే నెలకు క్యారీ ఫార్వర్డ్ చేసుకునే (రోల్ ఓవర్) సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఇలా గరిష్టంగా 75GB వరకు డేటాను నిల్వ చేసుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా కేటాయించిన డేటా పూర్తయితే.. తర్వాత వాడే ప్రతీ 1MBకి ఒక పైసా చొప్పున వసూలు చేయనున్నారు. అయితే ఈ ప్లాన్‌లో కుటుంబ సభ్యులను యాడ్ చేసుకునే వెసులుబాటు లేకపోవడం కాస్త మైనస్ గా చెప్పవచ్చు. ఇక డేటా తోపాటు ఈ ప్లాన్ కింద అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు ఉచితంగా యూజర్లకు లభించనున్నాయి.
రూ.199 ప్లాన్ లో లభించే డేటా సరిపోదని భావించే వారికోసం రూ. 399 ప్లాన్ ను బీఎస్ఎన్ఎల్ అందుబాటులో ఉంచింది. ఈ ప్లాన్‌తో నెలకు 70GB డేటా యూజర్లకు లభిస్తుంది. దీని డేటా రోల్ ఓవర్ పరిమితి 210GB వరకు ఇచ్చారు. అంతేకాకుండా ఇందులో ఫ్యామిలీ కనెక్షన్లతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్ సౌకర్యం కూడా ఇచ్చారు.
Also Read: 90s కిడ్స్ ఫేవరెట్.. మార్కెట్లోకి నోకియా 1100 రీ-ఎంట్రీ.. ఇక బ్యాక్ టూ గోల్డెన్ డేస్ మామ!
పోస్ట్ పెయిడ్ కనెక్షన్ సులభంగా పొందేందుకు బీఎస్ఎన్ఎల్ వివిధ మార్గాలు అందుబాటులో ఉంచింది. ఇందులో భాగంగా యూజర్లు నేరుగా బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. లేదంటో దగ్గరలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం, రిటైలర్ షాపులోనైనా సంప్రదించి పోస్ట్ పెయిడ్ కనెక్షన్ పొందొచ్చు. రీఛార్జ్ ఖర్చు తగ్గించుకోవాలనుకునేవారికి BSNL రూ. 199 ప్లాన్ మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తోందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు సూచిస్తున్నాయి. అయితే కొత్త కస్టమర్లే కాకుండా ఇప్పటికే BSNL ప్రీపెయిడ్ సేవలు వాడుతున్నవారు కూడా ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లోకి మారవచ్చని తెలియజేస్తున్నాయి.
Also Read: గీజర్ Vs వాటర్ హీటర్..ఏది వాడితే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది?