Avinash Reddy: బీటెక్ రవి ధర్నా చూస్తుంటె నవ్వుకోవాలో, అసహ్యించుకోవాలో అర్థం కాలేదు అని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో చేసిన అరాచకాలు డైవర్ట్ చేయడానికి ఇలాంటి డ్రామాలు చేస్తున్నారని, ఇలాంటి నీచ రాజకీయం ఎప్పుడూ చూడలేదని అవినాష్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల నుంచి పంచాయితీ ఎన్నికల్లో ఏ విధంగా అధికార దుర్వినియోగం చేశారో ప్రజలు చూశారు. పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు, ఓటర్లు అడ్డుకోవడం చూశామని అన్నారు.
పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసి డైవర్ట్ చేశామని అనుకుంటున్నారు. వీళ్ళ నిరసన చూసి ప్రజలు అసమహ్యించుకుంటున్నారు. సామాన్య ప్రజలు అందరు గమనిస్తున్నారని, ప్లీనరీ సమయంలో వైయస్సార్ విగ్రహానికి కట్టిన టిడిపి తోరణాలు తొలిగించినందుకు మాపై హత్యాయత్నం కేసు పెట్టారని గుర్తు చేశారు. వేల్పులు రాము మీద దాడి తిరిగి మాపైనే కేసు పెట్టారని, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ సందర్బంగా మాపై దాడి మాపైనే కేసు పెట్టారని అన్నారు. నిన్న చక్రాయపేటలో వైసిపి కార్యకర్తలు నామినేషన్ వేసినందుకు నాన్ బెయిల్ బుల్ కేసులు పెట్టారని అన్నారు.
Also read: చలి వణికిస్తోందా?రూ.1,499కే దొరికే ఈ రూమ్ హీటర్‌తో ఇల్లు వెచ్చగా మార్చుకోండి
ఇంతటీ వరస్ట్ పోలీసింగ్ ఎప్పుడు చూడలేదు.. అగుగూడులో టిడిపి వాళ్ళే పెట్రోల్ బాఃబులు వేసి దాడి చేశారు. వాస్తవాలు వక్రీకరించడానికి పోలీస్ స్టేషన్ ముందు డ్రామా చేశారని ఫైర్ అయ్యారు. డిఐజి, కలెక్టర్, పోలీసులు మీ వైపు ఉన్నా కూడా మావాళ్ళను అరెస్ట్ చేయమని కోరుతున్నారని, మా కార్యకర్తలు బయట ఉంటే తట్టుకోమని భయపడుతున్నారు. మా వాళ్ళ ముందు నిలబడే దమ్ము లేదు. ఈ ప్రాంతంలో ఒక దుర్మార్గుడు, ఇన్ఛార్జ్ మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని అన్నారు.
2021 స్దానిక ఎన్నికల్వో నామినేషన్లు చించినట్లు దాడి చేసినట్లు దమ్ముంటె ఒకటి చూపించండి. నాడు మీకు నిలబడె దమ్ము లేక పారిపోయారని, నేడు ప్రాణాలు పణంగా పెట్ఠి నామినేషన్ వేసే పరిస్థితి వచ్చిందని అన్నారు. దీనికి కారణం మీరు కాదా.. మీ రాజకీయాలు ప్రజలు చూస్తున్నారు. ప్రజాస్వామ్యం అడ్డుకున్నది, దాడి చేసింది ఎవరో ప్రజలకు తెలుసని మంత్రి అవినాష్ రెడ్డి అన్నారు. మిమ్మల్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని ప్రజల కోపానికి మీరు గురయ్యారని మంత్రి అవినాష్ రెడ్డి అన్నారు.
Also read: అమ్మాయిల మనసులో ఏముందో చదివే వింత శక్తి… కుర్రాడి జీవితంలో వరం తెచ్చిన చిలిపి కష్టాలు… ఫాంటసీ కామెడీ