Nandyal Accident: ఆళ్లగడ్డలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 20 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. ఢీ కొన్న రెండు బస్సులు ప్రైవేటు ట్రావెల్‌కి చెందినవి. తిరుపతి నుంచి హైదరాబాద్ కు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
ఆళ్లగడ్డలో ఈ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. రెండు బస్సులో ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 20 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. ఢీ కొన్న రెండు బస్సులు ప్రైవేటు ట్రావెల్ కి చెందినవి. నంద్యాల-తిరుపతి నేషనల్ హవేపై శుక్రవారం వేకువజామున రెండు ప్రైవేటు బస్సులు ఢీ కొన్నాయి. స్పాట్‌లో ముగ్గురు ప్రయాణికులు మృత్యవాతపడ్డారు.
మరో 20 మంది వరకు గాయపడ్డారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్నాయి రెండు ప్రైవేటు బస్సులు. అయితే మార్గ మధ్యలో ఆళ్లగడ్డ సమీపంలోని ఆల్ఫా ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న జగన్ ట్రావెల్స్ బస్సుని వెనుక నుంచి వేగంగా వస్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది.
ఈ ఘటనలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో ఇద్దరు, జగన్ ట్రావెల్స్ బస్సులో మరొకరు మృతి చెందారు. ఘటన తర్వాత జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగ్రాతులను సమీపంలోని ఆసుపత్రికి అంబులెన్స్‌ల ద్వారా తరలించారు.
ALSO READ: ఏపీలో హెలికాఫ్టర్ అంబులెన్సులు వస్తున్నాయి.. అంతా ఉచితమే
రెండు బస్సుల మధ్య మృతదేహాలు ఇరుక్కుపోవడంతో పొక్లెయిన్ సాయంతో బయటకు తీశారు. మృతి చెందిన ప్రయాణికులు ఎవరు? ఏ ప్రాంతం నుంచి ఎక్కడకు వెళ్తున్నారు? అనేది తెలియాల్సివుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.