OTT Movie : ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉందంటే, ఇక మనుషులతో అవసరం లేదన్నట్లే కొంతమంది ప్రవర్తిస్తున్నారు. దీని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉంటుందో, ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. ఈ చిత్రం భవిష్యత్తు నేపథ్యంలో జరుగుతుంది. ఇక్కడ వ్యక్తులు ఒంటరి గదుల్లో ఖైదీలుగా ఉంటారు. వారి జీవితాలు ఒక కంప్యూటర్ స్క్రీన్ ద్వారా మానిటర్ చేయబడతాయి. ఈ సినిమా సోషల్ మీడియా, టెక్నాలజీ, మానవ స్వేచ్ఛ గురించి విమర్శాత్మకంగా చూపిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
స్టోరీలోకి వెళ్తే
ఈ స్టోరీ 014 అనే వ్యక్తితో ప్రారంభమవుతుంది. అతను ఒక చిన్న ఖాళీ గదిలో మెళుకువలోకి వస్తాడు. అతనికి తన గతం గురించి ఎలాంటి జ్ఞాపకం లేకుండా ఉంటుంది. ఇక్కడ అతను ఒక పాత కంప్యూటర్ తో మాట్లాడుతుంటాడు. ఈ సిస్టమ్ అతన్ని వినోదం అందించమని ఆదేశిస్తుంది. అతను డాన్స్ చేయడం, జోక్స్ చెప్పడం లాంటివి చేస్తూ క్రెడిట్‌లు సంపాదిస్తాడు. వీటితో ఆహారం, నీరు, బట్టలు కొనుగోలు చేయవచ్చు. క్రెడిట్‌లు లేకపోతే, అతను ఆకలితో బాధపడాల్సివస్తుంది. త్వరలోనే ఈ వ్యక్తి #006395873 అనే మరొక ఖైదీతో కంప్యూటర్ ద్వారా కనెక్ట్ అవుతాడు. ఈ ఖైదీ సిస్టమ్‌తో ఎలా బతకాలో నేర్పుతాడు. అతను #014కు వీక్షకులను ఆనందపరిచేందుకు వినోదాత్మకంగా ఉండమని సలహా ఇస్తాడు. ఇద్దరూ కలిసి సిస్టమ్‌లో క్రెడిట్‌లు సంపాదించడానికి సరదా వీడియోలు చేస్తారు. అయితే #014 తన గతం గురించి, తానెందుకు ఈ గదిలో ఉన్నాడో ప్రశ్నించడం ప్రారంభిస్తాడు.
Read Also : ఇదెక్కడి సినిమారా బాబూ… మొక్కలకు ప్రాణం వచ్చి మనుషుల్ని లేపేస్తే… సై -ఫై మాస్టర్ పీస్ థ్రిల్లర్
తర్వాత #052605011 అనే మహిళ సిస్టమ్‌లో చేరుతుంది. ఆమె ఇక్కడినుంచి తప్పించుకోవాలనే లక్ష్యంతో ఉంటుంది. #014ను తిరుగుబాటుకు ప్రేరేపిస్తుంది. ఆమె సిస్టమ్ లోపాలను కనుగొని, బయటి ప్రపంచంలోకి రావడానికి ఒక ప్లాన్ సిద్ధం చేస్తుంది. అయితే #038491828 అనే మరొక ఖైదీ, సిస్టమ్‌లో సంతోషంగా ఉండమని, క్రెడిట్‌లు సంపాదించడం ద్వారా సౌకర్యవంతమైన జీవితం గడపవచ్చని వాదిస్తుంది. ఈ విభిన్న వాదనలు గందరగోళం సృష్టిస్తాయి. ఇక్కడి నుంచి తప్పించుకోవాలా లేక సిస్టమ్‌లో స్థిరపడాలా అని ఆలోచనలో పడతారు. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, #014, #052605011 కలిసి కంప్యూటర్ ద్వారా సిస్టమ్ లోపాలను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది ఒక రివల్యూషన్‌కు దారితీస్తుంది. వీళ్ళు ఇక్కడి నుంచి బయటపడతారా ? సిస్టమ్ తో ఉండటానికి అలవాటుపడతారా ? అనేది ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
ప్లెక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్
‘Share’ (2023) ఇరా రోసెన్స్వీగ్ దర్శకత్వంలో వచ్చిన ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఇందులో మెల్విన్ గ్రెగ్, బ్రాడ్లీ విట్‌ఫోర్డ్, డానియెల్ కాంప్‌బెల్, ఆలిస్ బ్రాగా నటించారు. ఈ చిత్రం ఒక డిస్టోపియన్ ప్రపంచంలో జరుగుతుంది. ప్లెక్స్ ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది. IMDbలో ఈ సినిమాకి 5.4/10 రేటింగ్ ఉంది.