BigTV English

AP News : వానల వేళ కరెంట్‌తో జాగ్రత్త.. ముగ్గురు మృత్యువాత..

AP News : వానల వేళ కరెంట్‌తో జాగ్రత్త.. ముగ్గురు మృత్యువాత..
AP Electric Shock News


AP Electric Shock News(Local news andhra Pradesh) : వేర్వేరు చోట్ల జరిగిన విద్యుత్ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో ఓ ఇంట్లో కరెంటు రిపేర్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా మరొకరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు.

జమ్మలమడుగు మండలం పెద్ద దండ్లూరులో శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని శివశంకర్ కి చెప్పగా పరిశీలించేందుకు వెళ్లాడు. ఇదే సమయంలో ఇద్దరూ విద్యుదాఘాతానికి గురయ్యారు. శివశంకర్ అక్కడికక్కడే చనిపోగా.. శ్రీకాంత్ రెడ్డి జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా ప్రాణాలు కోల్పోయాడు.


కాకినాడ రూరల్ రాయుడుపాలెం జంక్షన్‌లోనూ విద్యుదాఘాతంతో ఓ కార్మికుడు మరణించాడు. భవనంపై కూలి పనులు చేస్తుండగా అకస్మాత్తుగా ఈ ఘటన జరిగింది. మృతుడు సామర్లకోట మండలం హుస్సేన్ పురం వాసిగా గుర్తించారు.

అనంతపురం జిల్లా రాయదుర్గంలో కరెంట్‌ షాక్‌తో భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. నిర్మాణ పనులు చేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘతానికి గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్దారించారు.

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×