BigTV English

Tirumala New Rules: తిరుమలలో మరో కొత్త రూల్.. భక్తులు తెలుసుకోవాల్సిందే!

Tirumala New Rules: తిరుమలలో మరో కొత్త రూల్.. భక్తులు తెలుసుకోవాల్సిందే!

Tirumala New Rules: తిరుమలకు వెళ్తున్నారా.. అయితే ఈ కొత్త రూల్ గురించి తెలుసుకోండి. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అన్ని చర్యలు చేపడుతున్న టీటీడీ మరో కొత్త రూల్ ప్రవేశపెట్టింది. ఈ రూల్ తో భక్తులకు మెరుగైన సేవలు అందించడమే టీటీడీ లక్ష్యంగా కనిపిస్తోంది. టీటీడీ చైర్మన్ గా నియమితులైన బీఆర్ నాయుడు మరో కొత్త రూల్ ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఇంతకు ఆ రూల్ ఏమిటి? అసలు ఈ రూల్ తో భక్తులకు ఏమేర మంచి చేకూరనుందో తెలుసుకుందాం.


కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనార్థం దేశ విదేశాల నుండి తిరుమలకు భక్తులు వస్తుంటారు. అటువంటి భక్తులు ప్రధాన ఎదుర్కొంటున్న సమస్యలపై టీటీడీ కొత్త చైర్మన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కొత్త రూల్ ప్రవేశపెడుతున్నట్లు స్వయంగా చైర్మన్ వెల్లడించారు. కొందరు టీటీడీ ఉద్యోగులు భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించే ఉద్యోగులపై చర్యలకు వెనుకాడబోనని చైర్మన్ తెలిపారు.

భక్తులకు అసౌకర్యం కలిగించే టీటీడీ ఉద్యోగులను గుర్తు పట్టేందుకు ఉద్యోగుల దుస్తులపై త్వరలోనే నేమ్‌ బ్యాడ్జ్‌ ఏర్పాటు చేయాలని టీటీడీ భావిస్తోంది. ఎందుకంటే కొందరు ఉద్యోగులు భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని, అటువంటి వారిని గుర్తించేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేమ్‌ బ్యాడ్జ్‌ ఇవ్వడం ద్వారా భక్తుల పట్ల అమర్యాదగా వ్యవహరించిన వారిని గుర్తించే అవకాశం ఉంటుంది.


Also Read: Financial Deadlines Dec 2024: ఆధార్ నుంచి ఐటీఆర్ వరకు.. వెంటనే ఈ పనులు చేసేయండి!

శ్రీనివాసుని దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల పట్ల బాధ్యతాయుతంగా, అంకితభావంతో టీటీడీ ఉద్యోగులు ప్రవర్తించేందుకు ఈ బ్యాడ్జ్‌ విధానం ఉపయోగకరంగా ఉంటుందని టీటీడీ పాలకమండలి భావిస్తోంది. టీటీడీ అన్ని విభాగాల్లో పనిచేసే ప్రతీ ఉద్యోగికి ఈ నేమ్‌ బ్యాడ్జ్‌ త్వరలోనే ఇచ్చేందుకు టీటీడీ ప్రయత్నం చేస్తోంది.

ఈ రూల్ అమల్లోకి వస్తే, ఎవరైనా టీటీడీ ఉద్యోగి అమర్యాదగా ప్రవర్తిస్తే, మీరు ఆ నేమ్ బ్యాడ్జీ ద్వారా అతని వివరాలతో నేరుగా టీటీడీకి ఫిర్యాదు చేయవచ్చు. ఈ పద్దతి ద్వారా భక్తులకు మెరుగైన సేవలను టీటీడీ ఉద్యోగులు కూడా అందించే వీలుంటుంది. అందుకే తిరుమలలో కొత్తగా అమలయ్యే ఈ రూల్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×