December deadlines: డిసెంబర్ వచ్చేసింది. ఈ ఏడాదికి మరికొద్ది రోజుల్లో శుభంకార్డు పడబోతోంది. అదే సమయంలో కొన్ని కీలక డెడ్ లైన్స్ కూడా ఉన్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకూడదంటున్నారు ఆర్థిక నిపుణులు. అందులో ఒకటి ఆధార్ ను ఉచితంగా అప్ డేట్ చేసుకోవడం, రెండోది సమయానికి ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం, మూడోది ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను సద్వినియోగం చేసుకోవడం. ఈ కీలక విషయాల్లో అస్సలు నిర్లక్ష్యంగా ఉండకూడదంటున్నారు నిపుణులు. వీటి ద్వారా మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉందంటున్నారు. సో, మీరు కూడా ఈ పనులను వెంటనే పూర్తి చేసుకోండి!
⦿ ఆధార్ అప్ డేట్ గడువు పొడిగింపు
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఉచిత ఆధార్ అప్ డేట్ కోసం డిసెంబర్ 14 వరకు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల వినియోగదారులు ఎటువంటి ఛార్జీలు లేకుండా తమ ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. పేరు, చిరునామా, పుట్టిన తేదీని సరి చేసుకునే అవకాశం ఉంది. 14 తర్వాత కూడా ఆధార్ అప్ డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ, కొత్త మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ గత 10 సంవత్సరాలుగా మీ ఆధార్ అప్ డేట్ చేసుకోకపోతే వెంటనే చేసుకోవడం మంచిది.
⦿ ఐటీఆర్ ఫైలింగ్
జూలై 31, 2024 డెడ్ లైన్ ను మిస్ అయిన పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ వివరాలను సమర్పించడానికి డిసెంబర్ 31, 2024 వరకు గడువు విధించింది. ఆలోపు తమ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)ని ఫైల్ చేయాలని సూచించింది. లేదంటే పెద్ద మొత్తంలో ఫైన్ విధించే అవకాశం ఉంటుంది. జరిమానా నుంచి తప్పించుకోవడానికి ఇదే చివరి అవకాశంగా ఆదాయపు పన్ను శాఖ వెల్లడించిందిజ డిసెంబర్ 31 లోగా ITR ఫైల్ చేయలేకపోయినా, ఆ తర్వాత కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, అదనపు పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుంది.
⦿ FDలపై వడ్డీ రేట్లు
ఫిక్స్‌డ్ డిపాజిట్ల((FD) లాంటి తక్కువ-రిస్క్ ఆప్షన్లలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్న వారికి డిసెంబర్ నెల చక్కటి అవకాన్ని కల్పిస్తున్నది. పలు బ్యాంకులు ప్రస్తుతం FDలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అయితే, ఈ నెల తర్వాత రేట్ల సవరణలు జరిగే అవకాశం ఉంది. IDBI బ్యాంక్ ఉత్సవ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ల కోసం వడ్డీని సవరించింది. డిసెంబర్ 31, 2024 వరకు ప్రత్యేక వడ్డీ రేట్లను అందిస్తోంది. తాజాగా వడ్డీ రేట్లు 300 రోజుల FDలకు 7.05%, 375 రోజుల FDలకు 7.25%, 444 రోజుల FDలకు 7.20% అందిస్తున్నది. సీనియర్ సిటిజన్లు ఈ పథకం కింద మరింత మెరుగైన లాభాలను పొందే అవకాశం ఉంటుంది. సో, మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మొత్తంగా ఈ నెలలో ముఖ్యమైన మూడు విషయాలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి.
Read Also: ఆర్బీఐ నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా, ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం