YSRCP petition on Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం నుంచి తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. నిందితులకు కచ్చితంగా శిక్ష పడాల్సిందేనంటూ సామాన్యుల నుంచి మఠాది పీఠాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. లడ్డూపై జరుగుతున్న ప్రచారానికి న్యాయస్థానం ద్వారా అడ్డుకోవాలని ప్లాన్ చేసింది.
తిరుమల లడ్డూ వ్యవహారంపై శుక్రవారం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది వైసీపీ. అత్యవసరంగా విచారణ జరపాలంటూ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టు తలుపులు తట్టారు. తిరుమల లడ్డూపై నిజాలు నిగ్గు తేలేందుకు కమిటీ వేసి వాస్తవాలు నిగ్గు తేల్చాలని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను వచ్చే బుధవారం విచారణ చేపడతామని తెలిపింది.
తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తక్షణమే విచారణ చేపట్టాలని పిటిషన్‌లో పేర్కొంది. తిరుమల ప్రసాదాల్లో జంతువులు కొవ్వు, చేపల నూనె కలిపారంటూ వ్యాఖ్యానించింది. దీనిపై హైకోర్టు ఏర్పాటు చేసిన కమిటీతో విచారణ చేపట్టాలని ప్రస్తావించింది. దీనిపై ప్రస్తుతం నిర్ణయం తీసుకోలేమని, వచ్చే బుధవారం విచారణ చేస్తామని తెలిపింది.
శ్రీవారి లడ్డూ వ్యవహారంలో వైసీపీపై ఇంటా బయటా తీవ్ర దుమారం రేగుతోంది. నేతల కామెంట్స్, టీవీ డిబేట్లు ఆపాలన్నది అందులో ప్రధాన సారాంశం. ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలోకి వెళ్తే ఎవరూ నోరు ఎత్తరన్నది ఆ పార్టీ ఆలోచన.
ALSO READ: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు
పిటిషన్‌ను వచ్చేవారానికి వాయిదా పడింది. ఈలోగా టీటీడీ వేసిన కమిటీ విచారణ రాబోతున్నట్లు తెలుస్తోంది. విచారణకు ముందే చర్యలు చేపట్టాలని కూటమి సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు అధికారులపైనా, లేక రాజకీయ నేతలపైనా అనేదానిపై ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రభుత్వం చెబితే తాము చేశామని అధికారుల్లోని ఓ వర్గం బలంగా చెబుతోంది.