BigTV English

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Ex MP Nandigam Suresh’s house: వైసీపీ మాజీ ఎంసీ నందిగం సురేష్ ఇంట్లో శుక్రవారం ఉదయం పోలీసులు సోదాలు చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరులోని ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో పెద్దలు ఎవరు లేకపోవడంతో నోటీసులు గోడకు అంటించి వెళ్లిపోయారు పోలీసులు. ఇంటికి సంబంధించినవారు ఎవరైనా వస్తే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీసులు పేర్కొన్నారు.


ఇంతకీ పోలీసులు ఎందుకు సోదాలు చేశారు? సోదాల వెనుక అసలేం జరుగుతోంది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ఆదేశాలతో ఆయనను రెండురోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించారు. దాని ఆధారంగా సోదాలు చేసినట్టు తెలుస్తోంది.

ALSO READ: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్


ఇంతకీ సురేష్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఏంటి? సురేష్ భార్య గానీ, ఇంట్లో పెద్దవాళ్లు లేకపోవడంతో నోటీసు అంటించారు. దాడి జరిగిన రోజు ఫోటోలు, విజువల్స్ దగ్గర పెట్టి విచారణ చేపట్టారు పోలీసులు.  ఫోటోలకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. దాదాపు 60 ప్రశ్నలు ఆయనను అడిగినట్టు సమాచారం.

అందులో కొన్నింటికి రిప్లై ఇచ్చారట. దాని ఆధారంగానే సోదాలు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం మాజీ ఎంపీ నందిగం సురేష్ గుంటూరు జైలులో ఉన్నారాయన. గురువారంతో ఆయన రిమాండ్ ముగిసింది. దీంతో పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. ఆయనకు వచ్చే నెల మూడు వరకు రిమాండ్ పొడిగించిన విషయం తెల్సిందే.

 

Related News

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

Big Stories

×