Tirumala: తిరుమలలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రక్షాళన చేపట్టిందన్నారు తిరుపతి జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్. తిరుమలలో తట్టల షాపుల పేరుతో కొత్త గోల మొదలైందని.. ఇది జనసేన పార్టీ మీదకు తీసుకువస్తున్నారని కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదిరోజులుగా భక్తులు నడవకుండా ఈ తట్టలు వెలిశాయని.. గత ప్రభుత్వంలోని టీటీడీ పాలకమండి ఛైర్మన్లు, ఈవో, తుడా ఛైర్మన్, మరో మంత్రి బంధువులకు ,అనునాయులకు 250 తట్టలు ఇచ్చారన్నారు. తట్టలు కోట్లలో జరిగే స్కాం అని.. 20 ఏళ్లలో అక్రమంగా తట్టలు ఏర్పాటు చేసి.. తిరుమలలో భక్తులకు సేవలందించాలన్నారు. అలాగే లైసెన్స్ లేని తట్టలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
టీటీడీ నుండి అధికారికంగా అనుమతులు పొంది అద్దెలు చెల్లిస్తున్న హాకర్ల సంఖ్య 620 మంది మాత్రమే. కాగా ఇప్పుడు కొండపై దాదాపు 1300 మంది అనధికారిక తట్టలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం 29 మంది మాత్రమే నడుపుతున్న టీ స్టాల్స్ ఇప్పుడు 128 కి చేరుకున్నాయి. టీటీడీ ఆరోగ్య శాఖ అసలు ఇంతమందికి టీ కాఫీలు అమ్ముకోవడానికి లైసెన్సులు ఎలా మంజూరు చేసిందో, దానికి ప్రామాణికం ఏమిటో ఎవరికి అర్థం కాదు.
కేవలం 16 మంది మాత్రమే వడ్డీకాసులు విక్రయించే వ్యాపారులు ఉండగా ఇప్పుడు 70 మంది వ్యాపారులు లైసెన్సులు పొందారు. కేవలం 13 మంది ఫోటోగ్రాఫర్ లైసెన్సులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 34 కు చేరింది. పండ్లు అమ్ముకునే వారు 28 మంది మాత్రమే లైసెన్సులు ఉండగా అనధికారికంగా మరో వంద మంది వ్యాపారాలు చేసుకుంటున్నారు.
Also Read: రచ్చ లేపిన ఫ్లెక్సీ.. కేడర్ మధ్య కర్రలతో ఫైటింగ్, అసలేం జరిగింది?
కూటమి ప్రభుత్వంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకుని వారిని తొలగించి ప్రక్షాళన చేస్తారని నాయకులు తెలిపారు. తిరుమలలో అక్రమాలు తవ్విన కొద్దీ వెలుగు చూస్తున్నాయి. గత పాలనలో అందిన కాడికి దోచుకున్నారు. ఆ ప్రభావం కూటమి ప్రభుత్వంపై పడుతుందన్నారు.