Hussainsagar Fire Accident: హుస్సేన్ సాగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు స్పీడ్‌గా కొనసాగుతోంది. ఈ ఘటనలో రెండు బోట్లు దగ్దం కాగా, ఒక్క బోటులో ఫ్రెండ్‌తో వెళ్లిన అజయ్ మిస్సింగ్ అయ్యాడు. అయితే అజయ్‌తో వెళ్లిన ఫ్రెండ్స్ సురక్షితంగా బయట పెట్టారు. అజయ్ ఏ ఆసుపత్రిలోనూ లేదన్నది పోలీసుల మాట. దీంతో అతడి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. లేక్ పోలీసు స్టేషన్‌లో అజయ్ ఫ్రెండ్ నుంచి వివరాలు రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు.
అజయ్ కోసం సాగర్‌లో రెండు బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. భరతమాతకు మహా హారతి ఇచ్చే కార్యక్రమాన్ని చూడడానికి వచ్చాడు. నగరానికి చెందిన అజయ్, ఫ్రెండ్స్‌తో కలిసి ట్యాంక్ బండ్ వచ్చాడు. బాణసంచా కాలుస్తూ ఉండగా రాత్రి హుస్సేన్ సాగర్‌లో రెండు బోట్లు దగ్ధమయ్యాయి. అప్పటి నుండి కనబడకుండా పోయాడు అజయ్.
హుస్సేన్‌సాగర్ అగ్నిప్రమాదంలో మొత్తం ఎనిమిది మందికి గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హారతి ఇస్తున్న సమయంలో పటాకులు సిద్ధం చేసింది ఓ టీమ్. పటాకులు పేల్చుతుండగా నిప్పురవ్వలు పడటంతో ఒక్కసారిగా బోటులో మంటలు చెలరేగాయి. ఘటన సమయంలో బోటులో దాదాపు 10మంది ఉన్నారు. వారందరూ గాయపడ్డారు.
గాయపడినవారిని సిటీలో వేర్వేరు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు తూర్పు గోదావరి జిల్లాకి చెందిన గణపతి. గణపతి శరీరం 80 శాతం కాలిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులు.
ALSO READ: సూర్యాపేట్‌లో ప్రేమ పెళ్లి.. ఆపై హత్య, ఏంటి మిస్టరీ?