E-Paper
Advertisement

Illegal Mining: అనుమతులు లేని గనుల్లో దర్జాగా విద్యుత్ వాడకం.. అధికారుల నిఘా శూన్యం..!

Illegal Mining: అనుమతులు లేని గనుల్లో దర్జాగా విద్యుత్ వాడకం.. అధికారుల నిఘా శూన్యం..!
Advertisement

Illegal Mining: స్వేచ్ఛ బ్యూరో: అనుమతులు లేని గనుల్లో యథేచ్ఛగా విద్యుత్ వాడకం
-విద్యుత్ శాఖ నిఘా శూన్యం..!
-ప్రభుత్వ ఆదాయానికి గండి..
-మైనింగ్ మాఫియా అరికట్టెదెలా..!
-ఇష్టారాజ్యంగా పలు శాఖల తీరు..!
-అక్రమ మైనింగ్ ను అరికట్టాలని స్థానికుల డిమాండ్

రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: అక్రమ మైనింగ్ పై ఉక్కు పాదం మోపాలని, నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరిగితే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పుతున్న పలు శాఖల లోపం వల్ల మైనింగ్ అక్రమార్కులకు వరంగా మారిందని ఆరోపణలు వస్తున్నాయి. విద్యుత్ శాఖ నిర్లక్ష్య కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని అక్కడ ఉన్న స్థానికులు ఆరోపిస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఓగీపూర్ గ్రామంలోని పట్టా భూమిలో ఇద్దరూ వ్యక్తులతోపాటు మరో నలుగురు వ్యక్తులు నాపరాయి గనులు జోరుగా సాగుతున్నాయి.

నాపరాయి కోతలు

Advertisement

ఈ గనులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా ట్రాన్స్ కో నుంచి విద్యుత్ కనెక్షన్లు పొందారు. లీజులు, ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్న నాపరాతి గనులకే కనెక్షన్ ఇవ్వాలని మైనింగ్ ఏడి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ విద్యుత్ కనెక్షన్లతో రాత్రి పగలు తేడా లేకుండా నాపరాయి కోతలు జోరుగా సాగుతున్నాయి. గని వ్యాపారులు ఖనిజ సంపాదన కొల్లగొడుతూ కోట్లకు పడగెత్తుతున్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంగా కాకుండా ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపాలని స్థానిక వాసులు కోరుతున్నారు.

అక్రమ మైనింగ్కు అడ్డుకట్టదే..?

నాపరాతి గనులు తవ్వడానికి పర్యావరణ, అటవీ, రెవెన్యూ ఇలా పలు శాఖల అనుమతులు తీసుకోవాలి. అవేవీ లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా తోడేస్తున్నారు. ట్రాన్స్ కో అధికారులు గృహ వినియోగదారులకు నిబంధన పక్క అమలు చేస్తుండగా నాపరాయి గనులకు అక్రమ కనెక్షన్లతో విద్యుత్ వినియోగిస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శలోస్తున్నాయి. అనుమతుల్లేకుండా విద్యుత్ అక్రమ కనెక్షన్లతో నిక్షేపాల తవ్వకం జోరుగా సాగుతోంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. విద్యుత్ శాఖ పుణ్యమా అంటూ అక్రమాకులు కోట్ల రూపాయలను సంపాదించుకుంటున్నారు. అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు జంకుతున్న అధికారులు.

Advertisement

Also Read: Student Harassment: వీణవంక గురుకులంలో గురువుల అరాచకం.. బలవంతంగా పిల్లతో పాదాభివందనాలు!

రాజకీయ ప్రభావంతోనే అధికారులు మౌనం..

గత కొన్ని రోజుల నుండి మైనింగ్ శాఖ అధికారులు అక్రమాలకులపై కొరడా దులుపుతున్న సంగతి తెలిసిందే. లీజు లేని నాపరాతి గనులకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వరాదని మైనింగ్ ఏడి విద్యుత్ అధికారులకు సూచించారు. పలు శాఖల కిందిస్థాయి అధికారులపై రాజకీయ బడా నేతల లేదా ఉన్నత స్థాయి అధికారుల ఒత్తిడి, బెదిరిస్తుండటం వెనుక ఏదో జరుగుతోందనే అనుమానాలు కలుగుతున్నాయి. లేక కింది స్థాయి అధికారులు గని వ్యాపారులు ఇచ్చే మామూళ్ల అలవాటు పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా రాజకీయ నాయకుల అనుచరులు చేసే అక్రమాలకు మద్దతు పలుకుతున్నట్లు ప్రచారం సాగుతుంది. దీంతోనే అక్రమలను అడ్డుకునేందుకు అధికారుల ప్రయత్నం శూన్యంగా మారినట్లు తెలుస్తుంది.

ప్రభుత్వ ఆదాయానికి గండి..

ప్రభుత్వానికి ఒక్క పైసా ఆదాయం రాకుండా పూర్తిగా అక్రమార్కుల జేబులు నింపుకుంటున్న వైనం అక్కడున్న ప్రాంతంలో యథేచ్ఛగా సాగుతోంది. అక్రమ విద్యుత్ కనెక్షన్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇందుకు సంబంధిత పలు శాఖల కొందరి అధికారులు, అధికార పార్టీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. పట్టా,ప్రభుత్వ భూములకు నిబ్బందలకు విరుద్ధంగా విచ్చలవిడిగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇట్టి గనులకు ప్రభుత్వం అనుమతులు లేకపోవడంతో
ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాల్సిన అధికారులు ‘మామూలుగా’ వదిలేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నాయి.

Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. హుజూరాబాద్‌ లేబర్ ఆఫీసులో ఏఎల్ఓ సస్పెన్షన్..!

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×