E-Paper
Advertisement

ఆళ్ల నాని మృతి పట్ల సీఎం చంద్రబాబు, జగన్, లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి!

ఆళ్ల నాని మృతి పట్ల సీఎం చంద్రబాబు, జగన్, లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి!
Advertisement

Alla Nani: మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు ఆళ్ల నాని (కాళీ కృష్ణ శ్రీనివాస్) హఠాన్మరణం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. 56 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన గుండెపోటుతో కన్నుమూయడం పట్ల పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి

Advertisement

ఆళ్ల నాని మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ, అందరితోనూ ఎంతో స్నేహపూర్వకంగా మెలిగే మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. నాని పవిత్ర స్మృతికి నివాళులర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మంత్రి నారా లోకేష్ సంతాపం

Advertisement

ఆళ్ల నాని హఠాన్మరణం పట్ల విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘కేవలం 56 ఏళ్ల వయసులోనే ఆయన గుండెపోటుతో దూరమవ్వడం ఎంతో బాధాకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆళ్ల నాని గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని లోకేష్ పేర్కొన్నారు.

వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

తన ఆత్మీయ నేత ఆళ్ల నాని మృతి నన్ను తీవ్రంగా కలిచివేసిందని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన జగన్, ఈ కష్టకాలంలో ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

Also Read: సుప్రీం కోర్టులో హైడ్రాకు చుక్కెదురు.. 40 ఎకరాల భూమి కేసు డిస్మిస్!

Tags

Related News

ఏపీలో తీవ్ర విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

ఏపీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రిలీజ్.. 20 డిపార్ట్‌మెంట్లలో ఖాళీలు, ప్రస్తుతం ఆ శాఖలకు సంబంధించి

పులివెందులలో అర్ధరాత్రి ఏం జరిగింది? గణేషుడి మండపం వద్ద కాల్పులు, పరుగో పరుగు

రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన.. బంగాళాఖాతంలో ద్రోణి, ఏపీలో భారీ వర్షాలు

నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’

Big Stories

Advertisement
×