E-Paper
Advertisement

TTD : అందుబాటులో టీటీడీ 2023 డైరీలు, క్యాలెండర్లు.. ఇలా పొందవచ్చు?

TTD : అందుబాటులో టీటీడీ 2023 డైరీలు, క్యాలెండర్లు.. ఇలా పొందవచ్చు?
Advertisement

TTD : 2023వ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను టీటీడీ భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుపతి, తిరుమలలోని టీటీడీ పుస్తక విక్రయ కేంద్రాల్లో వీటిని ఉంచింది. అదేవిధంగా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, దేవుని కడపలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో టీటీడీ క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి. నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపాల్లో ఈ క్యాలెండర్లు, డైరీలను విక్రయిస్తారు.

టీటీడీ క్యాలెండర్లు, డైరీలను భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా కూడా కొనుగోలు చేసుకోవచ్చు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా డబ్బులు చెల్లించి ఆర్డర్ చేయవచ్చు. భక్తులకు క్యాలెండర్లు, డైరీలను తపాలాశాఖ ద్వారా ఇంటి వద్దకే పంపిస్తామని టీటీడీ తెలిపింది. తపాలాశాఖ ద్వారా పొందాలంటే భక్తులు డీడీ తీసి పంపాలి. ఇందుకోసం ‘కార్యనిర్వహణాధికారి, టీటీడీ, తిరుపతి’ పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డీడీ తీసి కవరింగ్‌ లెటర్‌తో కలిపి ‘ప్రత్యేకాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్‌ కాంపౌండ్‌, కేటీ రోడ్డు, తిరుపతి’ అనే చిరునామాకు పంపాలి. ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు ద్వారా కూడా భక్తులకు టీటీడీ క్యాలెండర్లు, డైరీలను పంపుతారు. ఇందుకోసం రవాణా ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు 99639 55585,0877-2264209 నంబర్లలో సంప్రదించాలని టీటీడీ సూచించింది.

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×